- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'కొరియన్ కనకరాజు'లో మెర్లపాక గాంధీ ఒరిజినల్ టచ్
కొరియర్ కనకరాజు చిత్రంలో కామెడీ సన్నివేశాలు హైలెట్‌గా నిలవనున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో తక్కువ కాలంలోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో మేర్లపాక గాంధీ ఒకరు. ఈయన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్రంతో దర్శకుడిగా కెరీర్‌ను ప్రారంభించి, మొదటి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత రన్ రాజా రన్ చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ రెండు చిత్రాల విజయాలతో ఈయన క్రేజ్ ఒక్కసారిగా పెరిగింది. అయితే, ఆ తర్వాత ఈయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు వరుసగా ఫెయిల్యూర్ అవుతూ వచ్చాయి. ప్రస్తుతం ఈ యువ దర్శకుడు వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న కొరియన్ కనకరాజు చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ మూవీ నుండి ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మేర్లపాక గాంధీ కామెడీని అద్భుతంగా పండించగల దర్శకుడు. ఈయన మొదటి రెండు చిత్రాలలో కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. ఇక కొరియన్ కనకరాజు చిత్రంలో కూడా అద్భుతమైన కామెడీ సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలోని ఒక కామెడీ సన్నివేశం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునే విధంగా రూపొందించినట్లు సమాచారం. మరి ఈ సినిమాతో అయినా మేర్లపాక గాంధీ మంచి హిట్ అందుకొని మళ్లీ ఫామ్‌లోకి వస్తాడేమో చూడాలి.






