మగవారు మీకు ధైర్యం ఉంటే ప్రాస్టిట్యూట్ దగ్గరకు వెళ్లి అలా చేయండి.. దుమారం రేపుతున్న టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్

by Gugulothu.Kavitha |

‘1000 అబద్ధాలు’(1000 Aadhalu) సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఎస్తేర్ నోరోన్హా(Esther Noronha) మనందరికీ సుపరిచితమే.

మగవారు మీకు ధైర్యం ఉంటే ప్రాస్టిట్యూట్ దగ్గరకు వెళ్లి అలా చేయండి.. దుమారం రేపుతున్న టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘1000 అబద్ధాలు’(1000 Aadhalu) సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఎస్తేర్ నోరోన్హా(Esther Noronha) మనందరికీ సుపరిచితమే. ఆ తర్వాత ‘భీమవరం బుల్లోడు’(Bhimavaram Bullodu) మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. దీంతో వరుస అవకాశాలు వచ్చాయి. అలా ‘గరం’, ‘జయ జానకి నాయక’, ‘జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్’, ‘69 సంస్కార్ కాలనీ’, ‘డెవిల్’, ‘ఆదిపర్వం’, ‘టెనెంట్’ వంటి సినిమాల్లో నటించి మరింత పాపులారిటీ తెచ్చుకుంది. అయితే చేసింది తక్కువ చిత్రాలే అయినా ప్రేక్షకులకు బాగా నచ్చేసింది ఈ అమ్మడు.

కాకపోతే ఆమె నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో హీరోయిన్‌గా చాన్స్ లు తగ్గిపోయాయి. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే సింగర్ నోయల్‌(Noel)ను పెళ్లి చేసుకొని అభిమానులకు షాక్ ఇచ్చింది. కానీ ఆ వివాహం ఎక్కువ రోజులు నిలవలేదు. ఆ తర్వాత ఈ ఇద్దరూ విడిపోయారు. ప్రస్తుతం ఎస్తేర్ నోరోన్హా సింగిల్ గా ఉంటుంది. నోయెల్‌తో విడిపోయిన తర్వాత ఈ బ్యూటీ చిన్న చిన్న సినిమాలు చేస్తూ అలరిస్తుంది. అలాగే అందాల ఆరబోతకు హద్దులు చెరిపేస్తూ రొమాంటిక్ సీన్స్ లోనూ నటించేందుకు సై అంటుంది. ప్రస్తుతం ‘ది వేకెంట్ హౌస్’ అనే సినిమాకు దర్శకత్వంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తోంది.

ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ మాట్లాడుతూ.. ‘సమాజంలో వేశ్యలను చాలా చులకనగా చూస్తుంటారు. వేశ్య వృత్తిలోకి ఎవ్వరూ కావాలని రారు. ఆర్థిక పరిస్థితులు కారణంగా అలా మారుతారు. మగాళ్లు వేశ్యల దగ్గరకు వెళ్లి.. కోరికలు తీర్చుకోకుండా డబ్బులు ఇచ్చి వచ్చేయొచ్చుగా కానీ అలా చేయరు. వేశ్యలు సమాజంలో ఉన్నారు అంటే వారిని వాడుకునేవారు కూడా ఉన్నారని అర్థం.. మగాళ్లు వాళ్ళ దగ్గరకు వెళ్లకపోతే వేశ్యలు ఉండేవారు కాదేమో.. ఈ వ్యవస్థను ప్రోత్సహించేది కూడా మగాళ్లే’ అంటూ చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Next Story