‘రాకాస’ నుంచి మనసుని హత్తుకునే ‘పదే పదే’ మెలోడీ సాంగ్ రిలీజ్

by Chukka Sudharani |

‘రాకాస’ చిత్రం నుంచి బ్యూటీఫుల్ మెలోడీ సాంగ్ ‘ప‌దే ప‌దే ప్రాణం నిన్నే కోర‌గా..’సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్

‘రాకాస’ నుంచి మనసుని హత్తుకునే ‘పదే పదే’ మెలోడీ సాంగ్ రిలీజ్
X

దిశ, సినిమా: మెగా వారసురాలు నిహారిక కొణిదెల నిర్మాతగా మొదటి చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’తోనే బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుని.. ఎన్నో అవార్డుల్ని, రివార్డుల్ని అందుకుంది. అలాంటి ఓ అద్భుతమైన సినిమా తరువాత జీ స్టూడియోస్ స‌మర్పణలో నిహారిక త‌న పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై నిర్మాత‌గా ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి ‘రాకాస’ మూవీని నిర్మించారు. సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌ జంటగా నటించిన ఈ సినిమాను మానస శర్మ తెరకెక్కించాడు. సమ్మర్ స్పెషల్‌గా ఈ చిత్రం ఏప్రిల్ 3న రిలీజ్ చేయబోతోన్నారు. దీంతో అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్ర బృందం.. ప్రమోషనల్ కంటెంట్, గ్లింప్స్, టీజర్, సాంగ్ అన్నిటితో సినిమాపై జనాల్లో క్యూరియాసిటీని పెంచారు.

ప్రస్తుతం మ్యూజికల్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న టీమ్.. తాజాగా ‘పదే పదే’ అంటూ సాగే ఓ మెలోడీ సాంగ్‌ను తాజాగా రిలీజ్ చేసింది. ఈ లిరికల్ వీడియో సాంగ్‌ని చూస్తుంటే హీరో మీద హీరోయిన్‌కి ఉన్న ప్రేమ, వన్ సైడ్ లవ్ స్టోరీ కనిపిస్తోంది. హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ, వారి ప్రేమను చాటేలా సాంగ్ సాగింది. ఇక గ్రామీణ వాతావరణంలో చిత్రీకరించిన ఈ పాటలోని విజువల్స్ మనసుని హత్తుకునేలా ఉన్నాయి. ‘ప‌దే ప‌దే ప్రాణం నిన్నే కోర‌గా.. క‌లే నిజం కాదా నిన్ను చేర‌గా.. ఒకే ఒక ఆశ చాలుగా నువ్వే చాలుగా.. ప్రపంచ‌మే లేదే ప్రతీ క్షణం నువ్వే నా క‌థ‌’ అంటూ సాగే ఈ సాంగ్ ప్రజెంట్ నెట్టింట వైరల్ అవుతున్నది.



Next Story