ప్రభాస్‌ మూవీలో ఛాన్స్.. గట్టిగా ప్రయత్నిస్తున్న యంగ్ హీరోయిన్..??

by Web Desk |
ప్రభాస్‌ మూవీలో ఛాన్స్.. గట్టిగా ప్రయత్నిస్తున్న యంగ్ హీరోయిన్..??
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రభాస్ ట్రెండ్ నడుస్తోంది. ప్రభాస్ సినిమాలంటే వాటి క్రేజ్ వేరే లెవెల్లో ఉంటుంది. అందుకే ప్రభాస్ సరసన చేసేందుకు హీరోయిన్‌లు క్యూ కడుతున్నారు. ప్రభాస్ సినిమా అయితే చాలు కథ ఏదైనా ఓకే అనేస్తున్నారు. ఇదే తరహాలో ప్రభాస్ చేయనున్న తాజా సినిమాలో అవకాశం కోసం ఓ యంగ్ హీరోయిన్‌ తెగ ప్రయత్నం చేస్తోంది. అయితే మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నాడని నెట్టింట వార్తలు తెగ వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు 'రాజా డీలక్స్' అని పేరు ఫిక్స్ చేశారని కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. కానీ యంగ్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా మాత్రం ఇందులో అవకాశం కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తోందట. పారితోషికం విషయంలోనూ పెద్దగా పట్టించుకోవడం లేదట. ఇదివరకే మారుతి దర్శకత్వంలో రెండు సినిమాలు చేసిన బ్యూటీ అదే పరిచయంతో ప్రభాస్ సినిమాలో అవకాశం కోసం మారుతితో చర్చలు చేస్తోందంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో త్వరలో మారుతి ఏమైనా క్లారిటీ ఇస్తాడేమోచూడాలి.

Next Story

Most Viewed