- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న మెహరీన్
పెళ్లి విషయాన్ని తానే స్వయంగా వెల్లడించిన మెహరీన్.

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ బ్యూటిఫుల్ నటి మెహరీన్ పిర్జాదా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె వరుస సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటున్న సమయంలోనే రాజకీయ నాయకుడు భవ్య బిష్ణోయ్ ను పెళ్లి చేసుకోవాలి అనుకుంది. అందులో భాగంగా వీరిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. 2021 మార్చి 12న జైపూర్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి ఎంగేజ్మెంట్ చాలా ఘనంగా జరిగింది. అదే సంవత్సరంలో పెళ్లి చేయాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించుకున్నప్పటికీ, కొన్ని నెలల తర్వాత 2021 జూలైలో ఈ జంట పరస్పర అంగీకారంతో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంది. ఈ విషయాన్ని మెహరీన్ స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తూ వ్యక్తిగత కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.
అలాగే భవ్య బిష్ణోయ్ మరియు అతని కుటుంబంతో ఇకపై తనకు ఎలాంటి సంబంధం ఉండదని కూడా ఆమె స్పష్టం చేసింది. అయితే ఈ నిర్ణయానికి గల అసలు కారణాలను మాత్రం ఈ నటి బయటపెట్టలేదు. ఆ తర్వాత ఈమె సైలెంట్‌గా ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకుందని వార్తలు వచ్చినప్పటికీ, వాటిని ఆమె తీవ్రంగా ఖండించింది. ఇక తాజాగా ఈమె తనకు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఆర్ష్ ఔలాఖ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుందనే వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఇక పెళ్లికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో ఈ బ్యూటీ తన అభిమానులతో పంచుకోవడంతో అవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలకు పలువురు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తుండగా, ఈ వార్తతో చాలా మంది ఆశ్చర్యానికి గురవుతున్నారు.






