- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రెట్టీ గర్ల్ అంటూ శర్వానంద్ హీరోయిన్ పోస్ట్.. ఆకట్టుకుంటోన్న ఫొటో
హీరోయిన్ మెహ్రీన్ కౌర్ పిర్జాదా (Mehreen Kaur Pirzada) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ మెహ్రీన్ కౌర్ పిర్జాదా (Mehreen Kaur Pirzada) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. కృష్ణ గాడి వీర ప్రేమ గాధ (Krishna Gaadi's heroic love story) చిత్రంతో తెలుగు సినిమారంగంలోకి తెరంగేట్రం చేసింది. ఈ మూవీలో నేచురల్ స్టార్ నాని (Natural Star NanI)సరసన కథానాయి కగా నటించింది తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందింది నటి మెహ్రీన్.
ఈ మూవీకి హను రాఘవూడి (Hanu Raghavudi) దర్శకత్వం వహించాడు. 2017 లో ఫిల్లౌరీ అనే హిందీ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టి.. అక్కడ కూడా తన సత్తా చాటింది. తర్వాత మోహ్రీన్.. ‘‘ నొటా (Nota), జవాన్ (Jawan), మహానుభావుడు (Mahanubhavudu), C/o సూర్యా (C/o Surya), ఎంత మంచివాడవురా , ఎఫ్ త్రీ (F3), వారసుడు (Varasudu), అశ్వథ్థామ (Ashwathama), లోకల్ బాయ్ (Local Boy), ఎఫ్ 2, చాణక్య, కవచం (Chanakya, Kavacham), రాదా ది గ్రేట్ (Radha the Great), జవాన్ (Jawan) వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసులో ఉత్తమ నటిగా పేరు సంపాదించుకుంది.
నిన్న (మార్చి 1) మెహ్రీన్ తిరుమల శ్రీవారి(Tirumala SrivarU)ని దర్శించుకున్న విషయం తెలిసిందే. వేకువ జామున ఈ నటి శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొంది. ఈ సందర్భంగా మెహ్రీన్‌కు తితిదే అధికారులు స్వాగతం పలికారు. దర్శన ఏర్పాట్లు కూడా చేశారు. దర్శనం అనంతరం.. ఈ నటి పండితులు ఆశీర్వచనం చేసుకుంది. తీర్థప్రసాదం అందుకుంది.
ఇకపోతే ఈ హీరోయిన్ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానుల్ని అలరిస్తుందన్న విషయం తెలిసిందే. తాజాగా ఈమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. ‘‘అందమైన అమ్మాయి, ప్రార్థన చేసే అమ్మాయి, చాలా దీవించిన అమ్మాయి’’ అని క్యాప్షన్ రాసుకొచ్చి.. యల్లో కలర్ లో దిగిన ఓ ఫొటో కూడా పంచుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






