- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘సెలవుదినాన్ని బీచ్‌లో గడుపుతున్నాను’.. పొట్టి బట్టల్లో క్రేజీ ఫొటోలు పంచుకున్న హీరోయిన్
టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా (Mehreen Pirzada) క్రేజ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా (Mehreen Pirzada) క్రేజ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ నటి కేవలం తెలుగులోనే కాకుండా.. హిందీ, తమిళం, పంజాబీ చిత్రాల్లో నటిస్తూ.. ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. కృష్ణగాడి వీర ప్రేమ గాధ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి మంచి పేరు సంపాదించుకుంది.
తర్వాత ఈ అమ్మడు ఫిల్లౌరి, మహానుభావుడు, రాజా ది గ్రేట్ (Raja the Great), నెంజిల్ తునివిరుంధల్, సూర్య, జవాన్, పాంథం, నోటా కవచం, డిఎస్పీ దేవ్, చాణక్య, అర్దాబ్ ముతియారన్, ఎంత మంచివాడవురా, పట్టాలు, అశ్వత్థామ, మాంచి రోజులోచై, F3: సరదా మరియు నిరాశ, స్పార్క్ లైఫ్ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. మెహ్రీన్ అందం, అభినయం, నటనతో తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది.
ఇకపోతే ఈ అమ్మడు సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్‌తో అభిమానుల్ని అలరిస్తుంటుంది. తాజాగా మెహ్రీన్ నెట్టింట ఓ పోస్ట్ పెట్టింది. పొట్టి డ్రెస్సుల్లో క్యూట్ ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ పోస్ట్‌కు ఓ క్యాప్షన్ రాసుకొచ్చింది. ‘‘సెలవుదినాన్ని బీచ్ లో గడుపుతున్నాను’’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం మెహ్రీన్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






