Meghalu Cheppina Prema Katha : వ్యక్తిగత పోరాటాలు, ఎమోషనల్ అడ్డంకులు.. ఆకట్టుకుంటోన్న ట్రైలర్

by Chukka Sudharani |

యంగ్ హీరో నరేష్ అగస్త్య (Naresh Agastya) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’(Meghalu Cheppina Prema Katha).

Meghalu Cheppina Prema Katha : వ్యక్తిగత పోరాటాలు, ఎమోషనల్ అడ్డంకులు.. ఆకట్టుకుంటోన్న ట్రైలర్
X

దిశ, సినిమా: యంగ్ హీరో నరేష్ అగస్త్య (Naresh Agastya) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’(Meghalu Cheppina Prema Katha). దీనికి విపిన్ దర్శకత్వం (Director Vipin) వహిస్తుండగా.. సునేత్ర ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై ఉమా దేవి కోట నిర్మించారు. ఇందులో నుంచి వచ్చిన సాంగ్స్, టీజర్లు సినిమాపై ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించాయి. ఈ క్రమంలోనే తాజాగా థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు చిత్ర బృందం. ‘గజిబిజి లైఫ్‌కి దూరంగా ఒక అందమైన ప్లేస్. అసలు భూమి మీద కాదు.. మేఘాల మధ్య ఉన్న ఫీలింగ్’ అంటూ హీరోయిన్ వాయిస్ ఓవర్‌తో స్టార్ట్ అయిన ఈ ట్రైలర్‌లో.. హీరో ప్రేమించిన అమ్మాయిని (హీరోయిన్), చేస్తున్న జాబ్‌ను వదిలేసి సంగీతమే తన కెరీర్ అని ఫిక్స్ అవడంతో అందరూ దూరం అవుతారు.

వ్యక్తిగత పోరాటాలు, ఎమోషనల్ అడ్డంకులు మధ్య తన నాన్నమ్మ అడుగుజాడల్లో నడిచి మంచి సింగీతకారుడుగా ప్రతిభను నిరూపించుకుని, తన ప్రేమను తిరిగి ఎలా గెలుచుకుంటాడు అనేలా చాలా చక్కగా ట్రైలర్ కట్ చేశారు మేకర్స్. మేఘాలు చెప్పిన ప్రేమ కథ భావోద్వేగాలు, సంఘర్షణ, మనసును కదిలించే దృశ్యాలతో అల్లిన ఒక హృదయ విదారకమైన ప్రేమకథను అందిస్తునట్లు తెలుస్తుండగా.. ప్రస్తుతం ఈ ట్రైలర్‌కు నెట్టింట మంచి రెస్పాన్స్ వస్తుంది. కాగా.. ఈ మూవీ ఆగస్టు 22న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో నరేష్ అగస్త్య, రబియా ఖాతూన్(Rabia Khatun), రాధిక శరత్‌కుమార్ (Radhika Sarathkumar), తనికెళ్ల భరణి(Tanikella Bharani), వెంకటేష్ కాకుమాను, విద్యుల్లేఖ, సుమన్, ఆమని, తులసి, చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ కార్తికేయ, మోహన్ రామన్, తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Next Story