భర్తతో కలిసి ఎడారిలో ఎంజాయ్ చేస్తోన్న హీరోయిన్.. వైరల్ అవుతోన్న వీడియోలు

by Kodari Anjali |

టాలీవుడ్ హీరోయిన్ మేఘా ఆకాష్ వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

భర్తతో కలిసి ఎడారిలో ఎంజాయ్ చేస్తోన్న హీరోయిన్.. వైరల్ అవుతోన్న వీడియోలు
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ మేఘా ఆకాష్ వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 15న గత ఏడాది మేఘ ఆకాష్ పెళ్లి ఆమె ప్రియుడు సాయి విష్ణుతో అంగరంగ వైభవంగా జరిగింది. చెన్నైలో ఇరుకుంటుంబీకుల నడుమ వీరి వివాహం గ్రాండ్‌గా జరిగింది. పెళ్లి ఫోటోస్ కూడా చాలా రోజుల వరకు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి.

ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులు మధ్య ఇద్దరి వివాహం ఘనంగా జరిగింది. పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు. ఇక మేఘా ఆకాష్ పెళ్లాయ్యాక భర్త, ఫ్యామిలీతో కలిసి సరదాగా టూర్లకు చెక్కేసి.. సరదాగా గడుపుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ భర్త అండ్ ఫ్యామిలీతో కలిసి అరబ్ వెళ్లినట్లు తెలుస్తోంది.

ఎడారి ప్రాంతంలో ఫ్యామిలీతో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోన్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతుండటంతో క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. ఈ పోస్ట్‌కు మేఘా ఆకాష్ ఓ క్యాప్షన్ కూడా జోడించింది. ‘‘ఎడారి మాయాజాలాన్ని నిర్వచించడం కష్టం’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ నటి పోస్ట్ ట్రెండ్ అవుతోంది.

ఇక మేఘా ఆకాష్ అబద్ధం, చల్ మోహన్ రంగ, పెట్టా, వంత రాజవతాన్ వరువేన్, బూమరాంగ్, శాటిలైట్ శంకర్, ఎనై నోకి పాయుమ్ తోట, ఒరు పక్కా కథై, కుట్టి స్టోరీ, రాధే, రాజ రాజ చోర, ప్రియమైన మేఘా, గుర్తుందా సీతాకాలం, ప్రేమదేశం, సింగిల్ శంకరం స్మార్ట్‌ఫోన్ సిమ్రానం, రావణాసురుడు, మను చరిత్ర, సబా నాయగన్, వడక్కుపట్టి రామసామి,మళై పిడిక్కథ మనితాన్ వంటి తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల వద్ద మంచి పేరు తెచ్చుకుంది.

Next Story