‘బజూకా’ మూవీ వాయిదా..చివరి నిమిషంలో బిగ్ షాకిచ్చిన మెగాస్టార్ (ట్వీట్)

by Mallepaka Hamsa |

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి(Mammootty), డీనో డెన్నిస్ కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘బజూకా’(Bazooka).

‘బజూకా’ మూవీ వాయిదా..చివరి నిమిషంలో బిగ్ షాకిచ్చిన మెగాస్టార్ (ట్వీట్)
X

దిశ, సినిమా: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి(Mammootty), డీనో డెన్నిస్ కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘బజూకా’(Bazooka). యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రాన్ని సరేగమ, థియేట్రీ ఆఫ్ డ్రీమ్, యాడ్లీ ఫిల్మ్స్ బ్యానర్స్‌పై అబ్రహం(Abraham), రోహన్ దీప్ నిర్మిస్తున్నారు. అయితే ఇందులో ఐశ్వర్య మీనన్(Aishwarya Menon), సిద్ధార్థ్ భరతన్, సన్నీ వేన్, షైన్ టాప్ చాకో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఇప్పటికే ‘బజూకా’ వచ్చిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ అన్ని భారీ అంచనాలను పెంచాయి.

దీంతో సినీ ప్రియులంతా ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ విడుదలకు నోచుకోవడం లేదు. వాయిదాలు పడుతూ సినీ ప్రియులను నిరాశకు గురి చేస్తోంది. వాయిదా పడుతూ వస్తుంది. ఈ క్రమంలోనే మూవీ మేకర్స్ ఈ మూవీ ఫిబ్రవరి 14 విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు. దీంతో అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇక వారం ఉందనగా మెగాస్టార్ వాయిదా పడినట్లు వెల్లడించి షాకిచ్చారు. ‘బజూకా’ మూవీ ఏప్రిల్ 10వ తేదీన థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇందులో ఆయన బ్లాక్ కలర్ సూట్ ధరించి మోస్ట్ హ్యాండ్సమ్ లుక్‌లో కనిపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సినిమాపై హైప్ పెంచుతోంది.

Next Story