వార్ డ్రామాతో ఇండస్ట్రీకి రాబోతున్న మెగాస్టార్ మనవడు.. ‘ఇక్కీస్’ నుంచి బిగ్ అప్డేట్ ఇస్తూ మేకర్స్ పోస్ట్

by Mallepaka Hamsa |

మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan)మనవడు అగస్య నంద(Agasya Nanda) ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే.

వార్ డ్రామాతో ఇండస్ట్రీకి రాబోతున్న మెగాస్టార్ మనవడు.. ‘ఇక్కీస్’ నుంచి బిగ్ అప్డేట్ ఇస్తూ మేకర్స్ పోస్ట్
X

దిశ, సినిమా: మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan)మనవడు అగస్య నంద(Agasya Nanda) ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. ఆయన ‘ది ఆర్చీస్’ నెట్‌ఫ్లిక్స్ మూవీ ద్వారా వచ్చారు. ఇక ఇప్పుడు వార్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘ఇక్కీస్’ (Ikkis)టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శ్రీరామ్ రాఘవన్(Sriram Raghavan) దర్శకత్వం వహించారు. అయితే దీనిని మ్యాడాక్ ఫఇల్మ్స్ బ్యానర్‌పై దినేష్ విజన్ నిర్మిస్తుండగా.. ఇందులో ధర్మేంద్ర(Dharmendra), పాతాల్ లోక్ నటుడు జైదీప్ అహ్లావత్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

తాజాగా, మూవీ మేకర్స్ ‘ఇక్కీస్’కు సంబంధించిన బిగ్ అప్డేట్ ఇస్తూ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఈ చిత్రం అక్టోబర్ 2న థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు తెలుపుతూ టీజర్‌ను షేర్ చేశారు. అయితే ఈ చిత్రం 1971 ఇండో పాక్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేత్రపాల్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో ఆయన చేసిన ధైర్య సాహసాలు, త్యాగాను చూపించబోతున్నారట. ఇక టీజర్ గమనించినట్లుయితే.. ఇందులో యుద్ధ సన్నివేశాలను చూపించి క్యూరాయాసిటీని పెంచారు. అలాగే ఖేత్రపాల్ శౌర్యంగా పోరాడుతున్నట్లుగా కూడా చూపించారు.

Next Story