- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
క్యాన్సర్‌తో బాధపడుతున్న మెగాస్టార్.. ఎట్టకేలకు స్పందించి క్లారిటీ ఇచ్చిన టీమ్

దిశ, వెబ్‌డెస్క్: మలయాళ ఇండస్ట్రీలో మెగాస్టార్(Megastar)గా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో మమ్ముట్టి(Mammootty) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఆయన ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు గట్టిపోటీ ఇస్తున్నాడు. అయితే గత కొన్ని రోజులుగా అతని ఆరోగ్యంపై కొన్ని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో భాగంగా ఆయనకు క్యాన్సర్ వచ్చిందని, అందుకే సినిమాల నుంచి విరామం తీసుకున్నాడని పుకార్లు వచ్చాయి.
అయితే, మమ్ముట్టి ఆరోగ్య పరిస్థితిపై ఆయన పీఆర్ టీం స్పందించి క్లారిటీ ఇచ్చారు. ‘ప్రస్తుతం మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి రంజాన్ ఉపవాసం చేస్తున్నారు కాబట్టే ఆయన సెలవుల్లో ఉన్నారు. ఆ కారణంతోనే ఆయన తన షూటింగ్ షెడ్యూల్‌ని కూడా వాయిదా వేశారు. విరామం తర్వాత మళ్లీ మోహన్‌లాల్(Mohanlal), మహేష్ నారయణన్(Mahesh Narayan) సినిమా షూటింగ్‌కి తిరిగి వెళ్తారు. ముఖ్యంగా మమ్ముట్టి క్యాన్సర్ బారిన పడ్డారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అవన్నీ ఫేక్’ అంటూ రాసుకొచ్చింది. దీంతో నెటిజన్స్ అండ్ ఫ్యాన్స్‌లో ఫుల్ క్లారిటీ వచ్చేసింది.
READ MORE ...
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత