- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెగాస్టార్ ‘ప్రాణం ఖరీదు’కు 47 ఏళ్లు.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ ట్వీట్
మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) నటించిన ప్రాణం ఖరీదు (Pranam Kareedu) విడుదలై నేటికి 47 సంత్సరాలు గడుస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) నటించిన ప్రాణం ఖరీదు (Pranam Kareedu) విడుదలై నేటికి 47 సంత్సరాలు గడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన సోదరుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా మెగాస్టార్ మూవీ ఇండస్ట్రీపై ఎమోషనల్ ట్వీట్ చేశారు. నెల్లూరులో మేము ఉన్న రోజులు, నేను ఇంకా స్కూల్లో ఉన్న సమయం.. ‘ప్రాణం ఖరీదు’ సినిమాలో పెద్దన్నయ్య హీరోగా నటించిన ఆ రోజులు ఇప్పటికీ నా కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తాయి. కనకమహల్ థియేటర్‌లో ఆ సినిమా చూసిన రోజు నా ఆనందానికి అంతులేని ఉత్సాహం కలిగింది, అది మాటల్లో వర్ణించలేనిది కూడా.
47 సంవత్సరాల సినీ ప్రస్థానంలో ప్రతి అంశంలోనూ ఆయన అసాధారణంగా ఎదిగిన తీరు, అయినప్పటికీ అలసిపోని తత్వం, వినయంతో సహాయం చేసే ఆప్యాయమైన స్వభావాన్ని కోల్పోకుండా ఉండటం నిజంగా స్ఫూర్తిదాయకం. దుర్గమ్మ తల్లి ఆయనకు విజయం, ఆరోగ్యం, ఐశ్వర్యంతో కూడిన దీర్ఘాయుష్షును ప్రసాదించాలని కోరుకుంటున్నా. రాబోయే సంవత్సరాల్లో ఆయన మరిన్ని వైవిధ్యమైన పాత్రల్లో కనిపించాలని ఆశిస్తున్నా. ఆయనకు రిటైర్మెంట్ అనేదే లేదు. జన్మతః యోధుడు.. మన ప్రియమైన పెద్దన్నయ్య, శంకర్ బాబుగా పిలుచుకునే ‘మెగాస్టార్ చిరంజీవి’ ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచిపోతారు అంటూ పవన్ ట్వీట్ చేశారు.






