- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హిట్ డైరెక్టర్‌తో మెగాస్టార్ సినిమా.. హైప్ పెంచుతున్న పోస్ట్
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీనిస్తున్నారు.

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీనిస్తున్నారు. ప్రస్తుతం చిరు, వశిష్ట(Vasishta) కాంబోలో ‘విశ్వంభర’ సినిమా రాబోతుంది. ఇందులో త్రిష, అషికా రంగనాథ్(Ashika Ranganath) హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. దీనిని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రపోద్ నిర్మిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఈ క్రమంలోనే.. చిరంజీవి హిట్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela)తో ఓ మూవీ చేయనున్నట్లు ప్రకటన విడుదలై అందరి దృష్టిని ఆకర్షించింది. ఇదిలా ఉంటే.. తాజాగా, చిరంజీవి ఓ స్టార్ డైరెక్టర్‌తో ఓ క్రేజీ సినిమాను చేయనున్నట్లు సమాచారం. ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ హిట్ తెరకెక్కించిన డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ సినిమా చేస్తున్నారట. ఇందుకోసం చిరు 90 రోజుల కాల్ షీట్‌ను దర్శకుడికి ఇచ్చినట్లు టాక్. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ మే నెలలో స్టార్ట్ అయి అక్టోబర్‌లో పూర్తి కానుండగా.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది.
#ChiruAnil - It will be one of the fastest-made Telugu films in recent times.#GulteExclusive pic.twitter.com/qnBN8GBxwO
— Gulte (@GulteOfficial) March 7, 2025






