- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్వాగ్ లుక్‌లో మెగాస్టార్.. ఆకట్టుకుంటున్న మన శంకర వరప్రసాద్ గారు మూవీ కౌంట్ డౌన్ పోస్టర్
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ‘మన శంకర వర ప్రసాద్‌గారు’ (mana shankara varaprasad garu)సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ‘మన శంకర వర ప్రసాద్‌గారు’ (mana shankara varaprasad garu) సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి (Anil Ravipudi)తెరకెక్కిస్తుండగా షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఇక లేడీ సూపర్ స్టార్ నయనతార ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నారు.
అయితే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సంక్రాంతి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ‘మన శంకర వరప్రసాద్’ రూపొందిస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే ఇందులోంచి వచ్చిన పోస్టర్స్, సాంగ్స్ భారీ రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. అయితే ఇంకా ఈ చిత్రం రిలీజ్ కావడానికి రెండు రోజులే ఉన్నది. దీంతో తాజాగా ఈ విషయాన్ని తెలియజేస్తూ మూవీటీమ్ ఎక్స్ వేదికగా కౌంట్ డౌన్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.
‘పెద్ద స్క్రీన్లపై మనశంకరవరప్రసాద్ గారు మెగా స్వాగ్‌ని చూడటానికి మరియు జరుపుకోవడానికి 2 రోజులు మాత్రమే ఉంది.. బుకింగ్స్ ఈరోజు నుండి ప్రారంభమవుతాయి.. జనవరి 12, 2026న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా మనశంకర వరప్రసాద్ గారు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది’ అని రాసుకొచ్చారు. ఇక పోస్టర్‌లో చిరు స్వాగ్ లుక్‌లో ఖతర్నాక్ అనిపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read More..
చిరు సినిమా టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్






