చిరంజీవిని కలిసేందుకు ఆదోని నుండి సైకిల్‌పై వచ్చిన మహిళా అభిమాని

by Ajay Maddhiboyina |

త‌న‌ను క‌లిసేందుకు ఎంతో క‌ష్ట‌ప‌డి వ‌చ్చిన మ‌హిళా అభిమానిని మెగాస్టార్ చిరంజీవి ఆత్మీయంగా ఆహ్వానించి కాసేపు మాట్లాడారు. ఏపీలోని ఆదోని ప‌ట్ట‌ణానికి చెందిన రాజేశ్వ‌రి అనే చిరంజీవి వీరాభిమాని ఫేవ‌రెట్ హీరోను క‌లిసేందుకు సైకిల్ పై ఎంతో క‌ష్ట‌ప‌డివ‌చ్చారు.

చిరంజీవిని కలిసేందుకు ఆదోని నుండి సైకిల్‌పై వచ్చిన మహిళా అభిమాని
X

దిశ, వెబ్ డెస్క్: త‌న‌ను క‌లిసేందుకు ఎంతో క‌ష్ట‌ప‌డి వ‌చ్చిన మ‌హిళా అభిమానిని మెగాస్టార్ చిరంజీవి ఆత్మీయంగా ఆహ్వానించి కాసేపు మాట్లాడారు. ఏపీలోని ఆదోని ప‌ట్ట‌ణానికి చెందిన రాజేశ్వ‌రి అనే చిరంజీవి వీరాభిమాని ఫేవ‌రెట్ హీరోను క‌లిసేందుకు సైకిల్ పై ఎంతో క‌ష్ట‌ప‌డివ‌చ్చారు. విష‌యం తెలుసుకున్న మెగాస్టార్ ఆమెను ఆహ్వానించి ఎంతో అప్యాయంగా ప‌ల‌క‌రించారు.

త‌న‌ను క‌ల‌వ‌డానికి అభిమాని ప‌డిన క‌ష్టం చూసి చ‌లించిపోయారు. ఈ సంద‌ర్భంగా రాజేశ్వ‌రి చిరంజీవికి రాఖీ క‌ట్ట‌గా ఆమెను ఆశీర్వ‌దించి, బ‌హుమ‌తిగా సాంప్ర‌దాయ చీర‌ను అందించారు. అంతేకాకుండా రాజేశ్వ‌రి పిల్ల‌ల చ‌దువుల కోసం ఆర్థిక‌సాయం చేస్తాన‌ని హామీ ఇచ్చారు. చిరంజీవిని ద‌గ్గ‌ర నుండి చూడ‌ట‌మే కాకుండా ఆయ‌న‌తో కాసేపు మాట్లాడే అవ‌కాశం, రాఖీ క‌ట్టే అవ‌కాశం దొరికినందుకు రాజేశ్వ‌రి ఎంతో సంబుర‌ప‌డ్డారు.

Next Story