- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెద్ది షూటింగ్ సెట్‌లోకి మెగాస్టార్.. సినిమా రన్ టైమ్ అప్డేట్ వైరల్
‘పెద్ది’ సినిమా షూటింగ్‌కు సంబంధించిన క్యూట్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కలయికలో వస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ చిత్రం ‘పెద్ది’. ఈ మూవీ జూన్ 4న గ్రాండ్ థియేట్రికల్ రాబోతుందని ఇప్పటికే చిత్ర బృందం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వగా.. షూటింగ్‌కు సంబంధించిన పనులు చకచక కానిచ్చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ షూటింగ్ బీటీఎస్‌కి సంబంధించిన వీడియోను షేర్ చేశాడు డైరెక్టర్ బుచ్చిబాబు. ‘మన హృదయానికి దగ్గరగా ఉండే కొన్ని సరదా BTS క్షణాలు ఇవి.. మెగాస్టార్ చిరంజీవి, మావెరిక్ డైరెక్టర్ సుకుమార్ పెద్ది షూటింగ్‌కి వచ్చి విజట్ చేశారు. పెద్ది ప్రపంచవ్యాప్తంగా జూన్ 4న రాబోతుండగా, జూన్ 3న ప్రీమియర్లతో స్టార్ట్ అవుతాయి. త్వరలో ట్రైలర్ అనౌన్స్‌మెంట్ ఉంది’ అంటూ షేర్ చేసిన ఈ వీడియోలో మెగాస్టార్ చిరంజీవి పెద్ది సెట్స్‌కు విచ్చేసి చిత్ర యూనిట్‌ను ఆశ్చర్యపరిచారు.
అక్కడ జరుగుతున్న షూటింగ్ ప్రక్రియను దగ్గరుండి పరిశీలించిన ఆయన, రామ్ చరణ్ లుక్, దర్శకుడు బుచ్చిబాబు మేకింగ్ విధానాన్ని చూసి ముగ్ధులయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి యూనిట్ సభ్యులతో సరదాగా గడుపుతున్న వీడియో ప్రజెంట్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, రన్ టైమ్‌కు సంబంధించిన అప్డేట్ నెట్టింట వైరల్ అవుతున్నది. 3 గంటల 20 నిమిషాల రన్‌టైమ్‌తో ‘పెద్ది’ రాబోతుంది. 17న ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు అని ఓ పోస్ట్ వైరల్ అవుతుండగా.. ఇంత ఎక్కువ రన్ టైమా అంటూ ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు.






