‘మా ఇద్దరి గొడవలకు పవన్ కల్యాణే కారణం’.. మెగాస్టార్ కుమార్తె సెన్సేషనల్ కామెంట్స్

by Kodari Anjali |   (  Updated:2025-08-19 04:49:05  IST  )

టాలీవుడ్ ప్రముఖ కథానాయకుడు సీనియర్ నటుడు మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె కాస్ట్యూమ్ డిజైనర్, సినీ నిర్మాత సుష్మిత కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. సుష్మిత తన కెరీర్‌ను కాస్ట్యూమ్ డిజైనర్‌గా ప్రారంభించింది.

‘మా ఇద్దరి గొడవలకు పవన్ కల్యాణే కారణం’.. మెగాస్టార్ కుమార్తె సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ప్రముఖ కథానాయకుడు సీనియర్ నటుడు మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె కాస్ట్యూమ్ డిజైనర్, సినీ నిర్మాత సుష్మిత కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. సుష్మిత తన కెరీర్‌ను కాస్ట్యూమ్ డిజైనర్‌గా ప్రారంభించింది. ఖైదీ నంబర్ 150, రంగస్థలం, సైరా నరసింహ రెడ్డి, ఆచార్య వంటి రెండు సినిమాలకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేసింది. సంతోష్ శోభన్, గౌరీ జి. కిషన్ హీరో హీరోయిన్లుగా 2023లో వచ్చిన చిత్రం శ్రీదేవి శోభన్‌బాబు చిత్రానికి సుస్మిత కొణిదెల నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే.

2020లో సుష్మిత తన భర్త విష్ణు ప్రసాద్‌తో కలిసి చిన్న బడ్జెట్ చిత్రాలను నిర్మించడానికి తన సొంత నిర్మాణ సంస్థ గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత సుష్మిత షూట్ అవుట్ అట్ అలైర్ , శ్రీదేవి శోభన్ బాబు, సేనాపతి వంటి తదితన చిత్రాలను కూడా నిర్మించి మంచి గుర్తింపు దక్కించుకుంది. తన నిర్మాణ సంస్థలో ఇప్పుడు చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమా తెరకెక్కిస్తోంది. ఇదంతా పక్కన పెడితే..

మెగా ఫ్యామిలీ బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. మెగా ఫ్యామిలీని ఆదర్శంగా తీసుకోవాలంటూ చాలా మంచి నెట్టింట చర్చించుకుంటారు. అయితే తాజాగా టీవీ షోకు గెస్ట్‌గా హాజరైన సుష్మిత కొణిదెల చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ బాబాయ్ గురించి మీకున్న బాండింగ్ గురించి చెప్పమని యాంకర్ సుధీర్ అడగ్గా.. మేం అంతా చిన్నప్పటి నుంచే ఫ్రెండ్లీగా ఉంటామని తెలిపింది. కానీ నాకు రామ్ చరణ్‌కు మధ్య గొడవలు అవ్వడానికి కారణం మాత్రం పవన్ కల్యాణ్ బాబాయ్ వల్లనే అని వెల్లడించింది. అప్పట్లో టీవీలో అంతగా ఎంటర్‌టైన్మెంట్ ఉండదు కాబట్టి.. బాబాయ్‌కు బోర్ కొట్టినప్పుడల్లా.. ఏదో ఒక చిచ్చు పెడుతుంటారని.. అది చూస్తూ ఆయన ఎంజాయ్ చేస్తారని నవ్వుతూ ఫన్నీగా సుష్మిత చెప్పుకొచ్చింది.

Next Story