‘విశ్వంభ‌ర’ చిత్రబృందం కీలక నిర్ణయం.. ఓర‌కంగా మంచి ప్రయ‌త్నం.. మ‌రో ర‌కంగా కావ‌ల్సినంత ప‌బ్లిసిటీ!

by Gantepaka Srikanth |

హనుమాన్ జయంతి(Hanuman Jayanti) సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) విశ్వంభర చిత్రం(Vishvambhara Movie) నుంచి ‘రామ రామ’ అనే పాట(Rama Rama Song)ను చిత్రబృందం విడుదల చేసిన విషయం తెలిసిందే.

‘విశ్వంభ‌ర’ చిత్రబృందం కీలక నిర్ణయం.. ఓర‌కంగా మంచి ప్రయ‌త్నం.. మ‌రో ర‌కంగా కావ‌ల్సినంత ప‌బ్లిసిటీ!
X

దిశ, వెబ్‌డెస్క్: హనుమాన్ జయంతి(Hanuman Jayanti) సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) విశ్వంభర చిత్రం(Vishvambhara Movie) నుంచి ‘రామ రామ’ అనే పాట(Rama Rama Song)ను చిత్రబృందం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పాట సినిమా ఆడియెన్స్‌తో రామ భక్తులను కూడా తెగ ఆకట్టుకున్నది. 20 మిలియన్ల వ్యూస్‌తో యూట్యూబ్‌లో రికార్డులు సృష్టించింది. ఇదిలా ఉంటే.. విశ్వంభర చిత్రబృందం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ‘రామ రామ‌’ అనే పాటను పెన్‌డ్రైవ్స్‌లో నిక్షిప్తం చేసి, తెలుగు రాష్ట్రాల్లోని శ్రీ‌రామ‌, హ‌నుమాన్ ఆల‌యాల్లో పూజారుల‌కు కానుక‌గా ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆ ఏర్పా్ట్లు సైతం పూర్తి చేశారు. ఇక పంపిణీ చేయడమే పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై సినీ విశ్లేషకులు స్పందిస్తూ.. ఇది మంచి ప్రయ‌త్నం అని ప్రశంసిస్తున్నారు. మ‌రో ర‌కంగా దీని వల్ల కావ‌ల్సినంత ప‌బ్లిసిటీ కూడా వస్తుందని అభిప్రాయపడుతున్నారు.

చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. సీనియర్ నటి త్రిష(Trisha), యంగ్ బ్యూటీ అషికా రంగనాథ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. యువ దర్శకుడు వశిష్ట ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. దాదాపు 90 శాతం వరకు షూటింగ్ పూర్తి కావడంతో ప్రమోషన్స్ షురూ చేశారు. ఈ క్రమంలోనే ఒక్కొక్కటిగా పాటలు విడుదల చేస్తున్నారు. ‘రామ... రామ...’ అనే పాటను ఈనెల 12న విడుదల చేయగా, అభిమానుల్ని ఆకట్టుకున్నది. భక్తి ప్రధానంగా సాగే ఈ పాట, చిత్రీకరణ మనసుల్ని హత్తుకునేలా ఉందని అభిమానులు సోషల్ మీడియా వేదికగా వారి అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఈ విశ్వంభర చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించారు.

Next Story