గ్రాండ్‌గా మెగాస్టార్ చిరంజీవి కొత్త మూవీ పూజా కార్యక్రమం.. చీఫ్ గెస్ట్‌గా స్టార్ హీరో

by Gantepaka Srikanth |   (  Updated:2025-03-30 06:07:23  IST  )

టాలీవుడ్(Tollywood) అగ్రహీరో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్‌లో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.

గ్రాండ్‌గా మెగాస్టార్ చిరంజీవి కొత్త మూవీ పూజా కార్యక్రమం.. చీఫ్ గెస్ట్‌గా స్టార్ హీరో
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్(Tollywood) అగ్రహీరో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్‌లో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఉగాది పండుగ సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. మరో స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్(Victory Venkatesh) ఈ పూజా కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే దర్శకుడు అనిల్ రావిపూడి ప్రకటించారు. అతి త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

ఈ కార్యక్రమానికి హీరో వెంకటేశ్‌తో పాటు డైరెక్టర్ రాఘవేంద్రరావు, నాగబాబు(Naga Babu), నిర్మాతలు దగ్గుబాటి సురేశ్ బాబు, అల్లు అరవింద్ దిల్ రాజు, దర్శకుడు బాబీ తదితరులు హాజరయ్యారు. ఈ సినిమాకు మెగా 157 (#Mega157), చిరు అనిల్ (#ChiruAnil) అనే వర్కింగ్ టైటిల్స్ పెట్టారు. ఇదిలా ఉండగా.. ఇటీవలే డైరెక్టర్ అనిల్ రావిపూడి సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు. విక్టరీ వెంకటేశ్‌తో తీసిన సంక్రాంతి వస్తున్నాం చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతో మెగాస్టార్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం కోసం మెగా అభిమానులంతా ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు.

Next Story