- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో అగ్రహీరో ఫ్యామిలీతో మెగాస్టార్ పెళ్లిరోజు సెలబ్రేషన్స్
మెగాస్టార్ చిరంజీ(Megastar Chiranjeevi) - సురేఖ(Surekha Konidela) దంపతులు నేడు 45వ పెళ్లిరోజు వేడుక జరుపుకుంటున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీ(Megastar Chiranjeevi) - సురేఖ(Surekha Konidela) దంపతులు నేడు 45వ పెళ్లిరోజు వేడుక జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యలో సోషల్ మీడియా వేదికగా ఆయన అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు విషెస్ చెబుతున్నారు. తాజాగా.. ఫ్లైట్‌లో వెళ్తూ చిరంజీవి సోషల్ మీడియా(X)లో ఆసక్తికర పోస్టు పెట్టారు. ‘‘మా వివాహ వార్షికోత్సవాన్ని దుబాయ్‌కి వెళ్తూ మాకు చాలా ఇష్టమైన స్నేహితులతో విమానంలో జరుపుకుంటున్నాము. సురేఖ మంచి మనసున్న మనిషి నాకు భార్యగా రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆమె నా బలం. నా చుట్టూ ఎప్పుడూ పాజిటివ్ వాతావరణం ఉండేలా చూసుకుంటుంది. సురేఖకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు’ అని చిరంజీవి పేర్కొన్నారు. కాగా, చిరంజీవి ప్రయాణిస్తున్న ఫ్లైట్‌లో అక్కినేని నాగార్జున(Nagarjuna), ఆయన భార్య అమల(Amala), మహేష్ బాబు భార్య ఘట్టమనేని నమత్ర(Namrata) ఉన్నారు.
కాగా, 1980 ఫిబ్రవరి 20న చిరంజీవి, సురేఖ వివాహం జరిగింది. సురేఖ అలనాటి ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య కుమార్తె. సుప్రీం హీరో మెగాస్టార్‌గా ఎదుగుతున్న తరుణంలో ఈ వివాహం జరిగింది. వీరిద్దరూ ఒక్కటై నేటితో 45 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఎంతో ప్రత్యేకమైన ఈ రోజున వారికి మెగా కుటుంబసభ్యులంతా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
మరోవైపు.. యువ దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న విశ్వంభర సినిమా(Vishwambhara Movie)లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్నారు. ఇందులో అశికా రంగనాథ్ హీరోయిన్‌గా నటిస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ వాళ్లు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సమ్మర్‌లోనే విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Celebrating our wedding anniversary on a flight with some very dear friends
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 20, 2025
en route Dubai ! 🎉
I always feel I am very fortunate to have found a dream life partner in Surekha.
She is my strength, my anchor and the
wind beneath my wings. Always helps me navigate through the… pic.twitter.com/h4gvNuW1YY






