- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇది మొత్తం ఇండస్ట్రీ సమస్య.. వారు మాత్రమే సాల్వ్ చేయగలరు: చిరంజీవి
సినీ కార్మికుల వేతనాల పెంపు అంశంపై మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: సినీ కార్మికుల వేతనాల పెంపు అంశంపై మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు. సినీ కార్మికుల(Film Workers) వేతనాల పెంపు అంశంలో తనపై వస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు. ఈ అంశంలో తాను ఇప్పటివరకూ జోక్యం చేసుకోలేదని అన్నారు. ఫిల్మ్ ఫెడరేషన్(Film Federation) సభ్యులను తాను కలిశానని మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 30 శాతం వేతనం పెంపు డిమాండ్‌పై తాను నెరవేరుస్తానని చెప్పినట్లు.. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తానని హామీ ఇచ్చినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇది తెలుగు సినీ పరిశ్రమ సమస్య అని చెప్పారు. ఈ విషయంలో తాను ఇప్పటివరకూ ఎవరినీ సంప్రదించలేదు. కలవలేదని స్పష్టం చేశారు. నాతో సహా ఏ ఒక్క వ్యక్తీ సమస్యలపై ఏకపక్ష హామీలు ఇవ్వలేదని వెల్లడించారు. ఫిల్మ్ ఛాంబర్ అనేది తెలుగు ఇండస్ట్రీకి ఉన్నటువంటి అత్యున్నత సంస్థ అని అన్నారు. ఈ సమస్యకు కూడా ఫిల్మ్ ఛాంబర్ మాత్రమే సమిష్టిగా వారితో చర్చలు జరిపి పరిష్కారం చూపిస్తుందని తెలిపారు. అప్పటివరకు దయచేసి తప్పుడు వార్తలను ప్రచారం చేయకండి అని చిరంజీవి వేడుకున్నారు.






