పవన్ కల్యాణ్ కుమారుడికి ప్రమాదం.. స్పందించిన మెగాస్టార్‌ చిరంజీవి

by Gantepaka Srikanth |   (  Updated:2025-04-08 14:45:59  IST  )

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్‌ శంకర్‌(Mark Shankar) అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు.

పవన్ కల్యాణ్ కుమారుడికి ప్రమాదం.. స్పందించిన మెగాస్టార్‌ చిరంజీవి
X

దిశ, వెబ్‌వెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్‌ శంకర్‌(Mark Shankar) అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు. సింగపూర్‌లో అతడు చదువుతున్న స్కూల్‌లో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో మార్క్ శంకర్‌తో పాటు పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా పవన్ కుమారుడి చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ప్రస్తుతం గాయపడిన చిన్నారులను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. తాజాగా.. ఈ అనూహ్య ప్రమాదంపై మార్క్ శంకర్ పెదనాన్న, మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) స్పందించారు. ఈ మేరకు మంగళవారం మీడియాకు హెల్త్ అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం 8 ఏళ్ల వయసున్న మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. కాళ్లకు స్వల్ప గాయాలయ్యాయని చిరంజీవి పేర్కొన్నారు. మరోవైపు పవన్ కల్యాణ్ కుమారుడికి గాయాలు అయ్యాయనే విషయం తెలిసి ఏపీ మంత్రి నారా లోకేష్(Nara Lokesh), బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) స్పందించారు. ఈ మేరకు వీరు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Next Story