- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Megastar Chiranjeevi: గేమ్ ఛేంజర్ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి పోస్ట్.. ఏమన్నారంటే?
నేడు (జనవరి 10)రామ్ చరణ్(Ram Charan) హీరోగా వచ్చిన గేమ్ ఛేంజర్(Game Changer) సినిమా బాక్సాఫీసు వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంటోంది.

దిశ, వెబ్‌డెస్క్: నేడు (జనవరి 10)రామ్ చరణ్(Ram Charan) హీరోగా వచ్చిన గేమ్ ఛేంజర్(Game Changer) సినిమా బాక్సాఫీసు వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంటోంది. కియారా అద్వాణి(Kiara Advani) కథానాయిక నటించిన ఈ మూవీకి శంకర్ దర్శకత్వం వహించారు. అయితే మూవీ మంచి టాక్ తో దూసుకుపోవడంతో పలువురు సినీ నటీనటులు సోషల్ మీడియా వేదికన వరుస పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే సాయిధరమ్ తేజ్(Saidharam Tej), ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej), రామ్ చరణ్ సతీమణి ఉపాసన(upasana) పలువురు ఇన్‌స్టా వేదికన పోస్టులు పెట్టారు.
తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తండ్రి టాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికన గేమ్ ఛేంజర్ సినిమా టీమ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. తనయుడి సినిమా చూసిన వారంతా ప్రశంసలు కురిపిస్తున్నారని.. అది చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని పోస్ట్‌లో చిరు తెలిపారు. అప్పన్న, రామ్ నందన్ పాత్రలకు గానూ రామ్ చరణ్ ను చాలా మంది కొనియాడుతున్నందుకు చాలా హ్యాపీగా ఉందని అన్నారు. అలాగే కియారా అద్వాణి, అంజలి, ఎస్. జె. సూర్య, నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ శంకర్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు అని ట్విట్టర్ వేదికన మెగాస్టార్ చిరంజీవి రాసుకొచ్చారు.






