- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దటీజ్ మెగాస్టార్ చిరంజీవి.. పిల్లలు రా మీరంతా.. ఆయన క్రేజ్‌ను అందుకోవడం అంత ఈజీ కాదు.. అప్పట్లోనే..
మెగాస్టార్ చిరంజీవి.. చాలా మంది నటీనటులు, దర్శకులు, నిర్మాతలకు ఒక ఇన్‌స్పిరేషన్. ఆయనను చూసి హీరోగా ఎదగాలని అనుకున్నవారు ఎంతో మంది.. ఆయనను చూసి దానగుణాన్ని నేర్చుకున్నవారు

దిశ, ఫీచర్స్ : మెగాస్టార్ చిరంజీవి.. చాలా మంది నటీనటులు, దర్శకులు, నిర్మాతలకు ఒక ఇన్‌స్పిరేషన్. ఆయనను చూసి హీరోగా ఎదగాలని అనుకున్నవారు ఎంతో మంది.. ఆయనను చూసి దానగుణాన్ని నేర్చుకున్నవారు ఇంకెంతో మంది.. ఆయనను చూసి ఆర్టిస్టులయ్యారు.. కొరియోగ్రాఫర్లు అయ్యారు.. ట్రస్ట్‌లు పెట్టారు.. దానధర్మాలు చేస్తున్నారు.. ఒక్క మనిషి ఎంతో మందిలో మార్పు తీసుకురాగలిగాడు. అలాంటి హీరో క్రేజ్ గురించి వర్ణించడం చేతకాదు. కానీ ఓ ఇన్సిడెంట్ మాత్రం షేర్ చేసుకుంటున్నామని తెలిపింది వైజయంతీ మూవీస్ బ్యానర్.
ఫిల్మ్ ఇండస్ట్రీలో క్లాసిక్ మూవీగా నిలిచిపోయిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రీరిలీజ్ సందర్భంగా ఈ విషయాన్ని పంచుకున్నారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జగదేక వీరుడిగా చిరు.. అతిలోక సుందరిగా శ్రీదేవి.. ఆహా అద్భుతం అనిపించారు. మే 9, 1990న విడుదలైన సినిమా.. అప్పటి వరకు ఉన్న రికార్డులన్నింటినీ చెరిపేపింది. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఓ కల్ట్ క్లాసిక్ అనేలా నిలిచిపోయింది. ఈ చిత్రం విడుదలైనప్పుడు దాని క్రేజ్ గురించి ఒక్క మాటలో ఓ ఉదాహరణగా చెప్పాలంటే.. రూ. 6 ధర ఉన్న టిక్కెట్ మొదటి మ్యాట్నీ షోకే బ్లాక్ మార్కెట్‌లో రూ. 210 వరకు అమ్ముడయ్యాయి. అంటే దగ్గరదగ్గరగా 35 రెట్లు అన్నమాట. కాగా ఈ చిత్రం ముప్పై ఐదు ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మళ్లీ మే 9న రిరిలీజ్ చేస్తున్నారు.






