- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Megastar Chiranjeevi: నా సోల్ మేట్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.. మెగాస్టార్ కామెంట్స్ వైరల్
పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం (Brahmanandam), అతని కుమారుడు రాజా గౌతమ్ (Raja Gautham) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రహ్మా ఆనందం’

దిశ, సినిమా: పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం (Brahmanandam), అతని కుమారుడు రాజా గౌతమ్ (Raja Gautham) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రహ్మా ఆనందం’ (Brahma Anandam). ‘మళ్ళీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద’ వంటి హ్యాట్రిక్ హిట్ల తర్వాత స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని.. శ్రీమతి సావిత్రి, శ్రీ ఉమేష్ కుమార్ సమర్పణలో నూతన దర్శకుడు RVS నిఖిల్ అద్భుతంగా తెరకెక్కించారు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన పత్రి అప్‌డేట్ ఆకట్టుకోగా.. పాజిటివ్ అంచనాల మధ్య ఈ చిత్రం ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ (Pre release event)ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. నాగ్ అశ్విన్ (Nag Ashwin), అనిల్ రావిపూడి (Anil Ravipudi) వంటి దర్శకులు ఈ కార్యక్రమంలో సందడి చేశారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) మాట్లాడుతూ.. ‘సినిమాను తీయడం ఎంత ముఖ్యం.. మంచి టైంకి రిలీజ్ చేయడం, ప్రమోట్ చేయడం చాలా ముఖ్యం. ఈ మధ్య కాలంలో అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం సినిమాను చక్కగా ప్రమోట్ చేశాడు. రాజా రవీంద్ర ఈ బ్రహ్మా ఆనందం సినిమా గురించి చెప్పాడు. హీరోలు దొరకడం లేదు.. ప్రమోషన్స్ కాస్త డల్‌గా ఉన్నాయ్ అని చెప్పాడు. నేను వస్తాను అని వెంటనే బ్రహ్మానందంకు ఫోన్ చేసి చెప్పాను. ప్రతీ దానికి, ప్రతీ చోటా చిరంజీవి కనిపిస్తున్నాడని అంతా అనుకున్నా సరే. నాకున్న ఇమేజ్, గుడ్ విల్ వాడి ఇతర సినిమాల్ని ప్రమోట్ చేస్తాను. నా మిత్రుడు బ్రహ్మానందం గురించి అయితే నేను కచ్చితంగా వస్తాను. బ్రహ్మానందం తన కొడుకుతో కలిసి చేసిన ఈ బ్రహ్మా ఆనందం మూవీని అందరూ ఆదరించాలి. ఈ మూవీని తీసిన నిఖిల్, నిర్మాత రాహుల్‌కు ఆల్ ది బెస్ట్. రఘు బాబు, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల వంటి వారు నటించడంతో పరిపూర్ణత చేకూరినట్టు అయింది. ఇలాంటి వేడుకకు నన్ను పిలిచిన నా సోల్ మేట్ బ్రహ్మానందంకు థాంక్స్. ఫిబ్రవరి 14న ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుంది. నీకు (బ్రహ్మానందం) పుత్రోత్సాహం కలుగుతుంది. నేను ఎలాగైతే పుత్రోత్సాహాన్ని పొందుతున్నానో.. నువ్వు కూడా అంతే పుత్రోత్సాహాన్ని పొందుతావు’ అని అన్నారు.






