- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళనాడు CM విజయ్‌కి మెగాస్టార్ చిరంజీవి ఫోన్
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జోసెఫ్ విజయ్‌కి మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేశారు. ఈ సందర్భంగా విజయ్‌కి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జోసెఫ్ విజయ్‌కి మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేశారు. ఈ సందర్భంగా విజయ్‌కి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. తమిళనాడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టీవీకే నేతృత్వంలోని ప్రభుత్వం విజయవంతంగా పనిచేయాలని చిరంజీవి ఆకాంక్షించారు. టీవీకే ప్రభుత్వ ప్రజా పాలన తమిళనాడు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని చిరంజీవి సూచించారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సాగే విప్లవాత్మక పాలనను విజయ్ అందిస్తారనే నమ్మకం తనకు ఉందని అన్నారు. ఈ సందర్భంగా తమిళనాడు రాజకీయాల్లో వెండితెరపై నుంచి వచ్చి ముఖ్యమంత్రిగా ప్రజా హృదయాలను గెలుచుకున్న లెజెండరీ నేత ఎంజీఆర్‌ను ఈ సందర్భంగా చిరంజీవి గుర్తుచేశారు. నాడు ఎంజీఆర్ సాధించినట్లుగానే, నేడు మీరూ ప్రజల నుంచి అపారమైన ప్రేమాభిమానాలను సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు. సినీ రంగంలో తన సీనియర్, వ్యక్తిగతంగా ఎంతో గౌరవించే మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలపడం పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సంతోషం వ్యక్తం చేశారు. చిరంజీవి చూపించిన ఆప్యాయతకు, ఆశీస్సులకు విజయ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.






