చిరంజీవి సినిమాలో ఆ మలయాళ సూపర్ స్టార్? ఇక ఇండ‌స్ట్రీ షేక్ కావాల్సిందే

by velandi.Saikiran |

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నట్లు సోషల్ మీడియాలో ఇప్పుడు వార్తలు

చిరంజీవి సినిమాలో ఆ మలయాళ సూపర్ స్టార్? ఇక ఇండ‌స్ట్రీ షేక్ కావాల్సిందే
X

దిశ‌, వెబ్ డెస్క్‌: మెగాస్టార్ చిరంజీవి, బాబీ దర్శకత్వంలో భారీ యాక్షన్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. మెగా 158 అనే వర్కింగ్ టైటిల్ తో వస్తోన్న ఈ సినిమా షూటింగ్ అతి త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వాల్తేరు వీరయ్య రాగా గ్రాండ్ సక్సెస్ అందుకుంది. KVN ప్రొడక్షన్ బ్యానర్ పై వెంకట్ నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీత స్వరాలు అందిస్తున్నారు. ఈ మూవీలో మాళవిక మోహన‌న్ హీరోయిన్ అని మొదట ప్రచారం జరిగినప్పటికీ, ఇంకా హీరోయిన్ ఫైనల్ కాలేదని ఇప్పుడు ప్రచారం జోరు అందుకుంది.

అయితే ఈ నేపథ్యంలో ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నట్లు సోషల్ మీడియాలో ఇప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయి. మొదట తమిళ హీరో కార్తీని తీసుకున్నారని ప్రచారం జరగగా, ఇప్పుడు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ పేరు తెరపైకి వచ్చింది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ లాంటి బడా హీరోల సినిమాలలో ప్రత్యేక పాత్రలో మోహన్ లాల్ కనిపించారు. ఇక ఇప్పుడు చిరంజీవి సినిమాలో మోహన్ లాల్ కనిపిస్తే, ఇండస్ట్రీ షేక్ కావడం గ్యారెంటీ అంటున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు తెలుస్తోంది.

Next Story