- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెగా158 పై బిగ్ అప్డేట్.. షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే అంటూ పోస్ట్
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో రాబోతున్న మెగా158 ప్రాజెక్టుకు సంబంధించిన పూజాకార్యక్రమాలు ఏప్రిల్ 11న జరగనున్నాయి.

దిశ, సినిమా: కుర్రహీరోలకు సమానంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద గట్టి పోటి ఇస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అందులో మెగా-158 ఒకటి. బ్లాక్ బస్టర్ 'వాల్తేరు వీరయ్య' తర్వాత దర్శకుడు బాబీతో మరోసారి చిరంజీవి చేతులు కలపడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చి చాలా కాలం అవుతున్న ఇప్పటికే వరకు ఎలాంటి అప్డేట్ అందలేదు. దీంతో అసలు బాబీ, చిరు కాంబో మూవీ ఉందా, లేదా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఇలాంటి సమయంలో మెగా 158కి సంబంధించిన బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ మేరకు ‘Mega158 కు సంబంధించిన అధికారిక పూజా కార్యక్రమం ఏప్రిల్ 11న జరగనుంది. చిత్రీకరణ ఏప్రిల్ 20న ప్రారంభం కానుంది’ అని ఓ పోస్ట్ నెట్టింట దర్శనమిచ్చింది. ఇక సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. మెగాస్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.






