‘మన శంకర వరప్రసాద్ గారు’ నుంచి మెగా విక్టరీ మాస్ సాంగ్ ప్రోమో అవుట్.. చిరు, వెంకీ స్టైల్ అదుర్స్ అంతే..

by Gugulothu.Kavitha |

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ‘మన శంకర వర ప్రసాద్‌గారు’ (mana shankara varaprasad garu)సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

‘మన శంకర వరప్రసాద్ గారు’ నుంచి మెగా విక్టరీ మాస్ సాంగ్ ప్రోమో అవుట్.. చిరు, వెంకీ స్టైల్ అదుర్స్ అంతే..
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ‘మన శంకర వర ప్రసాద్‌గారు’ (mana shankara varaprasad garu)సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి (Anil Ravipudi) తెరకెక్కిస్తుండగా షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఇక లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanathara) ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్(Venkatesh) గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నారు.

అయితే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సంక్రాంతి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ‘మన శంకర వరప్రసాద్’ రూపొందిస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే ఇందులోంచి వచ్చిన పోస్టర్స్, సాంగ్స్‌ భారీ రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఈ మూవీని 2026 సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మూవీ టీమ్ తాజాగా ‘మెగా విక్టరీ మాస్‌ సాంగ్‌’ ప్రోమోను నేడు విడుదల చేశారు. ఇక విడుదల చేసిన వీడియోలో చిరు, వెంకీ తమదైన స్టైల్‌తో అదరగొట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా ఫుల్ సాంగ్ డిసెంబర్ 30న రిలీజ్ చేయనున్నారు.

Next Story