మెగా విక్టరీ మాస్.. స్టెప్పులు అదిరిపోయాయి..

by Sujitha Rachapalli |

సంక్రాంతి వేడుకలు ముందుగానే ప్రారంభమయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న థర్డ్ సింగిల్ రిలీజ్ అయింది. ‘మెగా విక్టరీ మాస్’

మెగా విక్టరీ మాస్.. స్టెప్పులు అదిరిపోయాయి..
X

దిశ, సినిమా : సంక్రాంతి వేడుకలు ముందుగానే ప్రారంభమయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న థర్డ్ సింగిల్ రిలీజ్ అయింది. ‘మెగా విక్టరీ మాస్’ కాంబినేషన్, డైనమిక్ కెమిస్ట్రీ అదిరిపోయింది. ప్రేక్షకులను అలరించే సాంగ్స్ రూపొందించడంలో ప్రసిద్ధి చెందిన భీమ్స్ సిసిరోలియో అద్భుతమైన ట్రాక్‌ను అందించగా.. నక్ష్ అజీజ్, విశాల్ దద్లాని పవర్ ఫుల్ వోకల్స్ అందిస్తూ పాటలో ఎనర్జీ నింపారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం పక్కా మాస్ టచ్‌తో పాటు నాస్టాల్జియా ఫీల్‌ని మేళవించి, ఈ స్టార్ స్టడెడ్ రీయూనియన్‌కి పర్ఫెక్ట్‌గా నిలిచింది. స్టైలిష్ పబ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ పాటలో ఇద్దరు పవర్‌హౌస్ పెర్ఫార్మర్లు అదరగొట్టారు. చిరంజీవి మెగాస్టార్ ఆరా, వెంకటేష్ క్లాసీ చార్మ్ కలిసి ప్రతి ఫ్రేమ్‌ అద్భుతంగా ఉంది. కొరియోగ్రాఫర్ విజయ్ పోలకి హై-వోల్టేజ్ స్టెప్పులతో పాట ఎనర్జీని మరింత పెంచారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న మూవీలో నయనతార హీరోయిన్‌ కాగా.. చిత్రాన్ని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గరపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. అర్చన ప్రజెంట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్.. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.

Next Story