శేఖర్ కమ్ములకు అద్భుతమైన బహుమతి ఇచ్చిన మెగాస్టార్.. లవ్ యూ మై బాయ్ అంటూ స్పెషల్ గిఫ్ట్.. ఫొటోలు వైరల్

by Sujitha Rachapalli |   (  Updated:2025-06-04 12:15:13  IST  )

డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమాలు టైటిల్స్ మాదిరిగానే ‘మంచి కాఫీ’ మాదిరిగా.. చల్లని ‘గోదావరి’లా, చూస్తుండగానే ‘ఫిదా’ అయిపోయేలా ఉంటాయి. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు యూనిక్ మూవీస్‌తో ఆకట్టుకున్న ఈ దర్శకుడు

శేఖర్ కమ్ములకు అద్భుతమైన బహుమతి ఇచ్చిన మెగాస్టార్.. లవ్ యూ మై బాయ్ అంటూ స్పెషల్ గిఫ్ట్.. ఫొటోలు వైరల్
X

దిశ, ఫీచర్స్ : డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమాలు టైటిల్స్ మాదిరిగానే ‘మంచి కాఫీ’ మాదిరిగా.. చల్లని ‘గోదావరి’లా, చూస్తుండగానే ‘ఫిదా’ అయిపోయేలా ఉంటాయి. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు యూనిక్ మూవీస్‌తో ఆకట్టుకున్న ఈ దర్శకుడు.. వరుస విజయాలతో ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చాడు. ప్రస్తుతం కుబేర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. అయితే ఆయన ఇండస్ట్రీకి వచ్చి 25ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. తాను సినీ పరిశ్రమకు వచ్చేందుకు కారణమైన, తన సినిమాలతో ఇక్కడకు నడిపించిన మెగాస్టార్ చిరంజీవిని కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఎంజాయ్ చేశాడు.

కాగా ఈ సందర్భంగా ఆయనను సత్కరించిన మెగాస్టార్.. శుభాభినందనలు తెలిపాడు. తన జర్నీలో భాగం చేసినందుకు హ్యాపీగా ఉందని పోస్ట్ పెట్టాడు. అద్భుతమైన బహుమతిని అందించాడు. తను ఇష్టపడేవారికి ఇంతకు ముందు గిఫ్ట్ ఇచ్చినట్లుగానే శేఖర్ కమ్ములకు కూడా మోంట్‌బ్లాంక్ బ్లాక్ పెన్ ప్రజెంట్ చేశాడు. లవ్ యూ మై బాయ్ అంటూ కోట్ చేసిన మెగాస్టార్.. నీలాంటి ఒక అభిమాని ఉండటం నిజంగా ఆనందకరమని తెలిపాడు.

Next Story