- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mega Star: మెగాస్టార్ బర్త్ డే.. అడ్వాన్స్ విషెస్ చెప్పిన డిప్యూటీ సీఎం పవన్
మెగాస్టార్.. తెలుగు చలనచిత్ర రంగంలో ఆయన ఒక శిఖరం.

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్.. తెలుగు చలనచిత్ర రంగంలో ఆయన ఒక శిఖరం. రేపు ఆయన జన్మదినం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని చిరంజీవి (Chiranjeevi) అశేష అభిమానులు సంబురాలకు సిద్ధం అవుతున్నారు. చిరంజీవి సేవా సమితితో పాటు ఆలిండియా చిరంజీవి అభిమాన సంఘం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు చకచక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా (Social Media) వేదికగా స్పెషల్ విషెస్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), అన్నయ్య మెగాస్టార్ చిరంజీవికి అడ్వాన్స్‌గా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
చిరంజీవి తమ్ముడిగా పుట్టడం ఒక అదృష్టమైతే.. ఆయన కష్టాన్ని చూస్తూ పెరగడం గొప్ప అనుభవమని అన్నారు. అదొక వెల కట్టలేని జీవిత పాఠమని తెలిపారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి అసాధారణ వ్యక్తిగా ఎదగడం.. నాకే కాదు నా లాంటి ఎందరికో స్ఫూర్తి అని కొనియాడారు. కీర్తికి పొంగిపోలేదు.. విమర్శలకు కుంగిపోని వ్యక్తి చిరంజీవి అని అన్నారు. అపజయాలను సవాలుగా స్వీకరించే పట్టుదల అన్నయ్య నుంచే నేర్చుకున్నా. పితృ సమానుడైన అన్నయ్యకు, మాతృ సమానురాలైన వదినకు ఆ భగవంతుడు సంపూర్ణ ఆయుష్షు, ఆరోగ్య సంపద ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నా అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.






