చంద్రబాబు కీలక నిర్ణయం.. చిరంజీవికి అరుదైన గౌరవం !

by velandi.Saikiran |   (  Updated:2025-05-01 15:39:00  IST  )

మెగాస్టార్ చిరంజీవి కి ( Chiranjeevi ) అరుదైన గౌరవం లభించింది. రాజధాని అమరావతి ( Amaravathi) పునః ప్రారంభోత్సవానికి

చంద్రబాబు కీలక నిర్ణయం.. చిరంజీవికి అరుదైన గౌరవం !
X

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి కి ( Chiranjeevi ) అరుదైన గౌరవం లభించింది. రాజధాని అమరావతి ( Amaravathi) పునః ప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి హాజరు కాబోతున్నారు. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యేకంగా ఆహ్వానించింది చంద్రబాబు నాయుడు ( Chandrababu naidu) సర్కార్. శుక్రవారం రోజున.. రాజధాని అమరావతి పునః ప్రారంభోత్సవం నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం పంపింది ఏపీ ప్రభుత్వం.

ఈ కార్యక్రమం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ( Narendra modi) కూడా ఏపీకి వస్తున్నారు. శుక్రవారం అమరావతిలో దాదాపు 50వేల కోట్ల పనులకు... ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయబోతున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు, సచివాలయం అలాగే అసెంబ్లీ భవనాలతో పాటు న్యాయమూర్తుల నివాస సముదాయాలను కూడా ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేస్తారు.

వీటితో పాటు... నాగాయలంకలో 1500 కోట్లతో నిర్మించనున్న మిస్సైల్ టెస్ట్ రేంజ్ కు కూడా ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమం.. నేపథ్యంలో.. ఎవరికి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా... శాంతి భద్రతల సమస్యలు రాకుండా... ఏపీ పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

Next Story