Mega Prince: ‘సూర్యరశ్మిని ఆస్వాదించండి’ అంటూ మెగా ప్రిన్స్ పోస్ట్.. ఆకట్టుకుంటోన్న లేటెస్ట్ లుక్

by Kodari Anjali |

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Mega Prince: ‘సూర్యరశ్మిని ఆస్వాదించండి’ అంటూ మెగా ప్రిన్స్ పోస్ట్.. ఆకట్టుకుంటోన్న లేటెస్ట్ లుక్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. నిర్మాత నాగబాబు(Producer Nagababu) వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) అండ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Power Star Pawan Kalyan) లు చిన్నాన్నలు అన్న విషయం తెలిసిందే. వరుణ్ తేజ్ హేండ్సప్ (Handsup)అనే సినిమాలో బాల నటుడిగా నటించి.. నటుడిగా రంగప్రవేశం చేశాడు. తర్వాత ముకుంద (Mukunda) సినిమాలో ప్రధాన పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించాడు.

అనంతరం.. కంచె, లోఫర్(loafer), మిస్టర్, ఫిదా, తొలి ప్రేమ, అంతరిక్షం 9000 కెఎమ్‌పీహెచ్, నాన్న కూచి, ఎఫ్-2 (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్, అల్లాదీన్, గద్దలకొండ గణేష్, ఘని, ఎఫ్ -3, గాండీవదారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ (Operation Valentine), మట్కా వంటి చిత్రాల్లో నటించి.. వరుణ్ తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. ఇక సినిమాల్లో నటించే క్రమంలోనే వరుణ్ తేజ్ అండ్ టాలీవుడ్ హీరోయిన్ లొట్టచెంపల ముద్దగుమ్మ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ప్రేమలో పడ్డారు. తర్వాత ఇరుకుంబీకులను ఒప్పించి.. జూన్ 3023, 9 వ తారీకున నాగబాబు ఇంట్లో కుటుంబ సభ్యులు, సన్నిహితులు మధ్య గ్రాండ్‌గా నిశ్చితార్థం చేసుకున్నారు.

ఇక వివాహం వీరి ప్రేమ చిగురించిన చోటే అంగరంగ వైభవంగా జరిగింది. ఇటలీ సియెనాలోని బోర్గోశాన్ ఫెలిసీ రిసార్ట్‌(Borgosan Felice Resort)లో మెగా ఫ్యామిలీ మధ్య జరిగింది. ప్రస్తుతం వీరిద్దరు ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ మెగా ప్రిన్స్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. సూర్యరశ్మిని ఆస్వాదించండి’ అంటూ లేటెస్ట్ లుక్ విడుదల చేశాడు. హెయిర్ , గడ్డం బాగా పెంచుకుని స్టైలిష్‌గా కనిపిస్తోన్న ఈ పిక్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Next Story