- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ram Charan: మెగా మాస్ మేనియా.. రామ్ చరణ్ పోస్టర్‌తో హైప్ పెంచిన మేకర్స్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), శంకర్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ బడ్జెట్ మూవీ ‘గేమ్ చేంజర్’.

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), శంకర్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ బడ్జెట్ మూవీ ‘గేమ్ చేంజర్’. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే దీనిని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్(Sri Venkateswara Creations) బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తుండగా.. నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్, బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్, ఎస్‌జే సూర్య, సముద్రఖని(Samuthirakani), కన్నడ స్టార్ హీరో జయరామ్(Jayaram) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ‘గేమ్ ఛేంజర్’(Game changer) నుంచి వచ్చిన అప్డేట్స్ అన్ని భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి.
అయితే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ క్రమంలో.. తాజాగా, మూవీ మేకర్స్ కౌంట్‌డౌన్ స్టార్ట్ అయినట్లు తెలిపారు. 30 రోజుల్లో థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు తెలుపుతూ రామ్ చరణ్(Ram Charan) పోస్టర్‌ను షేర్ చేసి హైప్ పెంచారు. అంతేకాకుండా ‘‘మెగా మాస్ మేనియా వచ్చేస్తుంది. థియేటర్స్‌లో కలుద్దాం’’ అనే క్యాప్షన్ జత చేశారు. ఈ పోస్టర్‌లో రామ్ చరణ్ స్టైలిష్ లుక్‌లో బైక్‌పై వెళ్తున్నట్లు కనిపించారు.






