- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హ్యాపీ బర్త్ డే నా హీరోయిన్ గారు అంటూ ఆమెకు విష్ చేసిన మెగా హీరో.. గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతావని కామెంట్స్
మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘పిల్లా నువ్వు లేని జీవితం’(Pilla Nuvvu Leni Jeevitham) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఫస్ట్ మూవీతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక చివరగా ‘విరూపాక్ష’(Virupaksha) చిత్రంతో భారీ విజయాన్ని సాధించాడు. ప్రస్తుతం రోహిత్ కేపీ(Rohit KP) దర్శకత్వంలో ‘సంబరాల ఏటిగట్టు’(Sambara Yetigattu) అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన టైటిల్ గ్లింప్స్‌లో తేజ్ కనిపించిన తీరు చూసి ఇటు ఫ్యాన్స్ సైతం షాకయ్యారు. మొదటిసారిగా తేజ్ సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడని.. దీంతో ఈసారి బాక్సాఫీస్ షేక్ చేయడం ఖాయమంటున్నారు.
ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lakshmi) నటిస్తోంది. అయితే ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై చైతన్య రెడ్డి(chaitanya Reddy), నిరంజన్ రెడ్డి(Niranjan Reddy) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమా కోసం సాయి ధరమ్ తేజ్ తెగ కష్టపడిపోతున్నాడు. మరో పక్క నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో మెగా హీరో పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారిది.
తాజాగా సాయి ధరమ్ తేజ్ తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా ఓ పోస్ట్ షేర్ చేశాడు. అందులో హీరోయిన్ కలర్స్ స్వాతి(Swathi) ఫొటో షేర్ చేస్తూ.. ‘హ్యాపీ బర్త్‌డే స్వాతి గారు మై హీరోయిన్.. హ్యాపీ బర్త్‌డే స్వాతి గాడు మై కాలేజ్ ఫ్రెండ్’ అంటూ స్పెషల్ విషెస్ తెలిపాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు ఏంటి బ్రో ఇంకా వాళ్లకి వీళ్లకి విషెస్‌తో సరిపెట్టుకుంటావా నీ మ్యారేజ్‌కు సంబంధించిన గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతావంటూ కామెంట్స్ చేస్తున్నారు.






