- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Varun Tej: కొరియాకు వెళ్లనున్న మెగా హీరో వరుణ్ తేజ్.. కారణం అదేనా?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej), మేర్లపాక గాంధీ(Merlapaka Gandhi) కాంబినేషన్‌లో రాబోతున్న ఓ సినిమా రాబోతుంది.

దిశ, సినిమా: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej), మేర్లపాక గాంధీ(Merlapaka Gandhi) కాంబినేషన్‌లో రాబోతున్న ఓ సినిమా రాబోతుంది. ‘VT15’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఇందులో వరుణ్ తేజ్ సరసన రితికా నాయక్(Ritika Nayak) హీరోయిన్‌గా నటిస్తోంది. సత్య, మిర్చి కిరణ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇండో-కొరియన్ హారర్-కామెడీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘VT-15’సైలెంట్‌గా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుండటంతో అభిమానులు ఆనందపడుతున్నారు. VT15 హైదరాబాద్ & అనంతపురం షెడ్యూల్స్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో ఉత్కంఠభరితమైన సన్నివేశాలు, హాస్యంతో నిండి ఉన్న సీన్స్ సినిమాకు ప్రాణం పోస్తాయట. ఇక నెక్ట్స్ షెడ్యూల్ కోసం వరుణ్ తేజ్ కొరియాకు వెళ్లనున్నట్లు సమాచారం. కొరియా షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభమవుతున్నట్లు టాక్. అయితే అక్కడ కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.






