- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి అంటూ క్యూట్ ఫొటో షేర్ చేసిన మెగా హీరో.. క్యూట్‌నెస్ ఓవర్ లోడెడ్ అంటూ కామెంట్స్
మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘పిల్ల నువ్వు లేని జీవితం’(Pilla Nuvvu Leni Jeevitham) మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తన ఫస్ట్ సినిమాతోనే మంచి విజయం సాధించాడు. ఆ తర్వాత వరుస చిత్రాల్లో నటించి మెప్పించాడు. ప్రస్తుతం రోహిత్ కేపీ(Rohit KP) దర్శకత్వంలో ‘సంబరాల ఏటిగట్టు’(Sambara Yetigattu) అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన టైటిల్ గ్లింప్స్‌లో తేజ్ కనిపించిన తీరు చూసి ఇటు ఫ్యాన్స్ సైతం షాకయ్యారు.
మొదటిసారిగా తేజ్ సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడని.. దీంతో ఈసారి బాక్సాఫీస్ షేక్ చేయడం ఖాయమంటున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lakshmi) నటిస్తోంది. అయితే ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై చైతన్య రెడ్డి(chaitanya Reddy), నిరంజన్ రెడ్డి(Niranjan Reddy) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉన్నాడు ధరమ్ తేజ్. ఈ క్రమంలో మెగా మేనళ్లుడు పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా ఆయన తన ఇన్‌స్టా(Instagram)లో ఓ పోస్ట్ షేర్ చేశాడు. అందులో ఆయన క్యూట్ స్మైల్ చేస్తున్న పిక్‌ను షేర్ చేస్తూ. ‘వర్షం.. పాత తెలుగు/హిందీ/తమిళ్ సాంగ్.. పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి’ అనే క్యాప్షన్ జోడించాడు. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారగా.. దీన్ని చూసిన నెటిజన్లు క్యూట్‌నెస్ ఓవర్‌లోడెడ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






