Ram Charan: గొప్ప మనసు చాటుకున్న మెగా హీరో.. గోల్డెన్ హార్ట్ అంటూ నెటిజన్ల ప్రశంసలు (వీడియో)

by Hamsa |
Ram Charan: గొప్ప మనసు చాటుకున్న మెగా హీరో.. గోల్డెన్ హార్ట్ అంటూ నెటిజన్ల ప్రశంసలు (వీడియో)
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటించిన ‘గేమ్ చేంజర్’(Game Changer) మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. శంకర్(Shankar) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీసు వద్ద రాణించలేకపోయింది. థియేటర్స్‌లో రిలీజ్ అయిన రోజే హెచ్‌డీ ప్రింట్ ఆన్‌లైన్‌లో లీక్ కావడంతో మూవీ టీమ్‌కు నిరాశ ఎదురైంది. ఇక దీనిపై కేసు కూడా నమోదు కావడంతో పాటు నిందితులను కూడా పట్టుకున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా, రామ్ చరణ్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగా అభిమాని భార్యకు ప్రాణం పోశారు. ఈ విషయాన్ని అతను బాలయ్య అన్‌స్టాపబుల్(Unstoppable) షోలో చెప్పడంతో అంతా రామ్ చరణ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘‘నా భార్య ఏదేదో మాట్లాడేది. ఆ పరిస్థితులను రామ్ చరణ్ తెలుసుకుని వెంటనే అంబులెన్స్ పంపించారు. అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లాము. అక్కడికి వెళ్లగానే నా భార్య పేరు చెప్పగానే మీరా అని బాగా రిసీవ్ చేసుకున్నారు.

17 రోజుల పాటుగా ఐసీయూలో ఉచితంగా చికిత్స అందించారు. రోజుకో స్పెషలిస్ట్ వచ్చి చెక్ చేసేవారు. హాస్పిటల్ బిల్ ఎంత అవుద్దో అని కంగారు పడుతూనే ఉండేవాడిని. కానీ రామ్ చరణ్, ఉపాసన గారు ముందే ఆదేశాలు ఇచ్చారని వాళ్ళు అంతా చూసుకుంటున్నారని అక్కడున్న వారు చెప్పారు. నా భార్యకు ప్రాణం పోసి నాకు అప్పగించారు’’ అని సదరు వ్యక్తి బోరున ఏడ్చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా గోల్డెన్ హార్ట్ అని కామెంట్స్ చేస్తూ వీడియోను షేర్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed