- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జిమ్‌లో తెగ కష్టపడిపోతున్న మెగా హీరో.. ఈసారి పక్కా బ్లాక్ బస్టర్ హిట్ కొడతారు బ్రో అంటూ కామెంట్స్
మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, సినిమా: మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘పిల్లా నువ్వు లేని జీవితం’(Pilla Nuvvu Leni Jeevitham) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఫస్ట్ మూవీతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత ‘రేయ్’(Rey), ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’(subramanyam For Sale), ‘సుప్రీమ్’(Supreme), ‘తిక్క’(Thikka), ‘విన్నర్’(Winner), ‘నక్షత్రం’(Nakshathran), ‘జవాన్’(Jawaan), ‘ఇంటిలిజెంట్’(Intelligent), ‘తేజ్ ఐ లవ్ యు’(Tej I Love You), ‘ప్రతి రోజూ పండగే’(Prati Roju Pandage), ‘చిత్రలహరి’(Chitralahari), ‘సోలో బ్రతుకే సో బెటర్’(Solo Brathuke So Better), ‘రిపబ్లిక్’(Republic), ‘విరూపాక్ష’(Virupaksha) వంటి సినిమాల్లో నటించి మెప్పించాడు.
ప్రస్తుతం రోహిత్ కేపీ(Rohit KP) దర్శకత్వంలో ‘సంబరాల ఏటిగట్టు’(Sambara Yetigattu) అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన టైటిల్ గ్లింప్స్‌లో తేజ్ కనిపించిన తీరు చూసి ఇటు ఫ్యాన్స్ సైతం షాకయ్యారు. మొదటిసారిగా తేజ్ సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడని.. దీంతో ఈసారి బాక్సాఫీస్ షేక్ చేయడం ఖాయమంటున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lakshmi) నటిస్తోంది. అయితే ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై చైతన్య రెడ్డి(chaitanya Reddy), నిరంజన్ రెడ్డి(Niranjan Reddy) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
అయితే ఈ సినిమా కోసం సాయి ధరమ్ తేజ్ తెగ కష్టపడిపోతున్నాడు. జిమ్‌లో ఫుల్ వర్క్ అవుట్స్ చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియా(Social Media)లో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు దగ్గరవుతూ ఉన్నాడు. ఈ క్రమంలో ఆయన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా సాయి ధరమ్ తేజ్ తన ఇన్‌స్టా(instagram) వేదికగా ఓ ఫొటో షేర్ చేశాడు. అందులో జిమ్‌లో ఉన్న ఫొటో(Gym Photo)ను షేర్ చేస్తూ.. ‘చిత్తశుద్ధి మరియు క్రమశిక్షణతో తీసుకున్న ఏదైనా మార్గం గొప్పతనానికి దారి తీస్తుంది’ అనే క్యాప్షన్ జోడించాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు.. సినిమా కోసం ఇంతగా కష్టపడుతున్నారు కదా బ్రో .. ఈ సారి పక్కా బ్లాక్ బస్టర్ హిట్ కొడతావు నీ శ్రమ ఊరికే పోదంటూ కామెంట్స్ చేస్తున్నారు.






