పాశమైలారం ఘటనపై అల్లు శిరీష్ ట్వీట్

by Gantepaka Srikanth |   (  Updated:2025-07-01 15:24:38  IST  )

పాశమైలారం ఘటన(Pashamilaram incident)పై మెగా హీరో అల్లు శిరీష్(Allu Sirish) స్పందించారు.

పాశమైలారం ఘటనపై అల్లు శిరీష్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: పాశమైలారం ఘటన(Pashamilaram incident)పై మెగా హీరో అల్లు శిరీష్(Allu Sirish) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘సిగాచి ఘటన నా హృదయాన్ని కదిలించింది. బాధితుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. తప్పిపోయిన వారు సురక్షితంగా బయటకు వస్తారని ఆశిస్తున్నాను. మరో రోజు, మరో విషాదం. దేవుడు మనపై మరింత దయ చూపాలని ప్రార్థించండి’ అని ఎక్స్ వేదికగా శిరీష్ పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 36 మంది మృతిచెందారు. మరికొంతమంది గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అగ్నిప్రమాద ఘటనపై కేసు నమోదైంది. బాధిత కుటుంబాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ప్రముఖులు పరామర్శించారు.

Next Story