Chiranjeevi: మెగా పండుగ మొదలు.. ‘విశ్వంభర’ నుంచి సూపర్ అప్డేట్.. హైప్ పెంచేసిన పోస్టర్

by Mallepaka Hamsa |

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) బ్యాక్ టు బ్యాక్ సినిమాలు దూసుకుపోతూ కుర్ర హీరోలకు పోటీగా నిలుస్తున్నారు.

Chiranjeevi: మెగా పండుగ మొదలు.. ‘విశ్వంభర’ నుంచి సూపర్ అప్డేట్.. హైప్ పెంచేసిన పోస్టర్
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) బ్యాక్ టు బ్యాక్ సినిమాలు దూసుకుపోతూ కుర్ర హీరోలకు పోటీగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’. వశిష్ఠ మల్లిడి(Mallidi Vassishta) దర్శకత్వంలో రాబోతున్న ఈ పాన్ ఇండియా సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సోసియో-ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతుండగా.. దీనిని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వి. వంశీ కృష్ణా రెడ్డి(Vamsi Krishna Reddy), ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మి్స్తున్నారు. ఇక ఈ మూవీకి ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇందులో చిరంజీవి సరసన స్టార్ బ్యూటీ త్రిష, అషికా రంగనాథ్(Ashika Ranganath) కీలక పాత్రలో నటిస్తున్నారు.

అయితే షూటింగ్ ముగింపు దశకు చేరుకున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఊహించని విధంగా రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. అయితే పలు సార్లు వాయిదా పడిన ఈ చిత్రం మే 9న థియేటర్స్‌లో గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. కానీ గత కొద్ది రోజుల నుంచి ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ విడుదల చేయడం లేదు. దీంతో మెగా అభిమానులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పలు పోస్టులు చేస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం కనీసం ఒక పోస్టర్ అయినా విడుదల చేయాలని అంటున్నారు.

ఈ నేపథ్యంలో.. తాజాగా, డైరెక్టర్ వశిష్ఠ ‘విశ్వంభర’ నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ విషయాన్ని తెలుపుతూ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ రామ రామ సాంగ్ ఏప్రిల్ 12న హనుమాన్ జయంతి సందర్భంగా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా చిరంజీవి హనుమాన్‌ను భుజాలపై ఎత్తుకుని కలర్‌ఫుల్‌గా కనిపించగా.. వెనకా రాముడు చుట్టూరా హనుమాన్ వేశంలో ఉన్న చిన్నారులు ఉన్నారు. ఇక ఈ పోస్ట్‌కు ‘‘ఆ హనుమంతుడికి తన భగవంతుడైన శ్రీరాముని పట్ల ఉన్న ప్రేమ, గౌరవం ఉన్నాయి. అందుకే ఆ స్పెషల్ నాడు అప్డేట్ రాబోతుంది’’ అనే క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీంతో అది చూసిన వారంతా వావ్, సూపర్ అని కామెంట్లు చేస్తున్నారు.

Next Story