‘మెగా’ ఫ్యామిలీ సంక్రాంతి సంబరాలు..నిహారిక పోస్ట్ వైర‌ల్

by velandi.Saikiran |   (  Updated:2026-01-14 11:20:14  IST  )

భోగి సందర్భంగా దోసెలు వేసిన మెగా ఫ్యామిలీ, కాసేపు అంత‌క్ష‌రి కూడా ఆడింద‌ట‌

‘మెగా’ ఫ్యామిలీ సంక్రాంతి సంబరాలు..నిహారిక పోస్ట్ వైర‌ల్
X

దిశ‌, వెబ్ డెస్క్‌: సంక్రాంతి సంబ‌రాలు మొద‌ల‌య్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల‌లో సంబ‌రాలు చేసుకుంటున్నారు. ఈ త‌రుణంలోనే ‘మెగా’ ఫ్యామిలీ సంక్రాంతి సంబరాలలో పాల్గొంది. అంద‌రూ ఒక్క చోట చేరి సందడి చేశారు. ఈ సంబ‌రాల్లో రామ్‌చరణ్‌ కుటుంబం, వరుణ్‌తేజ్‌ ఫ్యామిలీ, నాగబాబు దంపతులు, సాయి దుర్గాతేజ్‌, వైష్ణవ్‌తేజ్‌ తదితరులు పాల్గొన్నారు.

మెగాస్టార్ చిరంజీవి కూడా సంద‌డి చేశారు. భోగి సందర్భంగా దోసెలు వేసిన మెగా ఫ్యామిలీ, కాసేపు అంత‌క్ష‌రి కూడా ఆడింద‌ట‌. ఈ త‌రుణంలోనే ‘మెగా’ ఫ్యామిలీ సంక్రాంతి సంబరాల వీడియోను సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన నిహారిక.. తెలుగు ప్రేక్ష‌కులు, మెగా అభిమానుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

సంక్రాంతికి హిట్ కొట్టిన మెగాస్టార్ చిరంజీవి

సంక్రాంతికి హిట్ కొట్టారు మెగాస్టార్ చిరంజీవి. మ‌న శంక‌ర‌వ‌ర ప్ర‌సాద్ గారు సినిమాతో సంక్రాంతి వ‌చ్చిన చిరంజీవి, భారీ క‌లెక్ష‌న్స్ రాబ‌డుతున్నారు. రెండు రోజుల్లోనే ఈ సినిమా రూ.122 కోట్లు వ‌సూలు చేసి, రికార్డు సృష్టించింది మ‌న శంక‌ర‌వ‌ర ప్ర‌సాద్ గారు సినిమా. కాగా ఈ సినిమాకు అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా, విక్ట‌రీ వెంక‌టేష్‌, న‌య‌న‌తార ఈ మూవీలో మెరిసారు.

Next Story