Niharika Konidela: ‘నేను నిన్ను అత్యంత ప్రేమిస్తున్నాను’.. మెగా డాటర్ నిహారిక ఇన్‌స్టా స్టోరీ వైరల్

by Kodari Anjali |   (  Updated:2025-03-10 17:54:19  IST  )

మెగా డాటర్ నిహారిక కొణిదెల (Mega Daughter Niharika Konidela) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Niharika Konidela: ‘నేను నిన్ను అత్యంత ప్రేమిస్తున్నాను’.. మెగా డాటర్ నిహారిక ఇన్‌స్టా స్టోరీ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా డాటర్ నిహారిక కొణిదెల (Mega Daughter Niharika Konidela) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ బుల్లితెరపై ఢీ జూనియర్స్‌(Dhee Juniors)లో యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. తర్వాత నిహారికకు నాగ శౌర్య (Naga Shaurya) సరసన ఒక మనసు సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోకున్నా.. నిహారిక నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.

తర్వాత నాన్న నాగబాబు (Naga Babu)తో కలిసి నాన్నకూచి వెబ్ సిరీస్‌లో కూడా నటించి.. ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అవకాయ్, డెడ్ పిక్సెల్స్ (Dead pixels) వెబ్ సిరీస్‌ల్లో కూడా తన అద్భుతమైన నటనను కనబర్చింది. అంతేకాకుండా.. సూర్యాకాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాల్లో కూడా అవకాశం కొట్టేసి.. నెటిజన్లను ఆకట్టుకుంది. ప్రస్తుతం నిర్మాతగా తన టాలెంట్ బయటపెడుతోంది.

నిర్మాతగా మొదటి సినిమాగా కమిటీ కుర్రాళ్లు (committee kurraḷlu) చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది నిహారిక. ఈ మూవీ జనాల అంచనాలకు రీచ్ అవ్వడంతో నిహారిక నిర్మాతగా మంచి పేరు సంపాదించుకుందని చెప్పుకోవచ్చు. ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ‘మా నిహారిక మూవీ చూడండి అంటూ మెగాస్టార్ చిరంజీవి కూడా ట్విట్టర్ వేదికన ఓ వీడియో పెట్టాడు. నిహారిక కష్టానికి ఫలితం దక్కిందని చెప్పుకోవచ్చు.

ఇకపోతే నిహారిక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసింది. జిమ్‌లో వర్కౌట్స్ చేస్తోన్న వీడియోలు.. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో వెకేషన్స్ కు వెళ్లినా అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తుంటుంది. అయితే తాజాగా ఈ మెగా డాటర్ నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒకటి రాసుకొచ్చింది. నేడు మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల (Sushmita Konidela)పుట్టిన రోజు అన్న విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా ఫ్యామిలీ మెంబర్స్ సోషల్ మీడియా వేదికన పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో నిహారిక కూడా.. ‘‘నా పార్ట్ టైమ్ అమ్మ, ఫుల్ టైమ్ అక్క అండ్ ఆల్ టైమ్ బెస్ట్ ఫ్రెండ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు! నేను నిన్ను అత్యంత ప్రేమిస్తున్నాను. అంటూ సుష్మిత కొనిదెలకు బర్త్ డే విషెష్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నిహారిక ఇన్‌స్టా స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Fore More Movie News : https://www.dishadaily.com/movie

Next Story