Niharika Konidela: ప్రేమలో పడిన మెగా డాటర్ నిహారిక.. అవును నేను అతడిని లవ్ చేస్తున్నానంటూ షాకింగ్ పోస్ట్!

by Mallepaka Hamsa |

నాగబాబు(Nagababu) కూతురు నిహారిక(Niharika Konidela) గురించి పరిచయం అక్కర్లేదు. ఈ అమ్మడు మెగా డాటర్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయింది.

Niharika Konidela: ప్రేమలో పడిన మెగా డాటర్ నిహారిక.. అవును నేను అతడిని లవ్ చేస్తున్నానంటూ షాకింగ్ పోస్ట్!
X

దిశ, సినిమా: నాగబాబు(Nagababu) కూతురు నిహారిక(Niharika Konidela) గురించి పరిచయం అక్కర్లేదు. ఈ అమ్మడు మెగా డాటర్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయింది. మొదట యాంకర్‌గా రాణించిన ఆమె నటనపై ఆసక్తితో హీరోయిన్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరించింది. కానీ అనుకున్నంత క్రేజ్ రాకపోవడంతో పలు షోస్ చేసింది. ఈ క్రమంలోనే నాగబాబు ఆమెను జొన్నలగడ్డ చైతన్య(Jonnalagadda Chaitanya)కు ఇచ్చి వివాహం జరిపించారు. అయితే కొద్ది రోజుల పాటు వీరి కాపురం సాఫీగానే సాగినప్పటికీ చిన్న చిన్న గొడవల కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు.

భర్తతో విడిపోయిన తర్వాత నిహారిక మళ్లీ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చింది. ఓ వైపు నిర్మాతగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు తెరకెక్కిస్తూనే మరోవైపు హీరోయిన్‌గా నటిస్తోంది. గత ఏడాది ఆమె నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు’(Committee Kurrollu) ఘన విజయం సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. ఇక నిహారిక హీరోయిన్‌గా నటించిన సినిమా బాక్సాఫీసు వద్ద బొల్తాపడటంతో ఎలాంటి కొత్త ప్రాజెక్ట్ ప్రకటించలేదు. ప్రస్తుతం సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిహారిక తన ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తూ పలు పోస్టులు షేర్ చేస్తోంది. తాజాగా, నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ షాకింగ్ పోస్ట్ పెట్టింది.

ఓ బుడ్డోడు నిహారిక గురించి రాసుకున్న దానిని షేర్ చేస్తూ.. మైనర్ పాస్‌పోస్ట్ నోట్‌బుక్. నేను అతడిని ప్రేమిస్తున్నాను. అంబటి భార్గవి మా ఫ్రెండ్‌షిప్ మధ్యలోకి నువ్వు రావద్దు. ఒకేనా ధన్యవాదాలు’’ అని రాసుకొచ్చింది. అలాగే రెడ్ హార్ట్ సింబల్స్‌ను కూడా షేర్ చేసింది. కానీ అతను ఎవరనేది మాత్రం వెల్లడించలేదు. ఇక ఈ పోస్ట్‌తో పాటు కాఫీ షాప్‌లోకి వెళ్లి ఎవరితోనో టైమ్ స్పెండ్ చేసిన వీడియోను కూడా షేర్ చేసింది. అంతేకాకుండా ఎప్పటికీ మణిరత్నం సినిమాలతో బతికేస్తా అనే క్యాప్షన్ జత చేసింది. ప్రస్తుతం ఈ రెండు పోస్టులు చూసిన వారంతా ఆమె మళ్లీ ప్రేమలో పడిందా ఈ విధంగా హింట్ ఇచ్చినట్లుందని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.





Next Story