Niharika: గుడ్ న్యూస్ ప్రకటించిన మెగా డాటర్ నిహారిక.. ఇంట్రెస్టింగ్ పోస్ట్‌తో సోషల్ మీడియాను షేక్ చేసేసిందిగా!

by Mallepaka Hamsa |   (  Updated:2025-04-02 10:20:41  IST  )

మెగా డాటర్ నిహారిక(Niharika)కు పరిచయం అక్కర్లేదు. ఈ అమ్మడు మెగా హీరో నాగబాబు(Nagababu) కూతురిగా పరిచయం అయింది.

Niharika: గుడ్ న్యూస్ ప్రకటించిన మెగా డాటర్ నిహారిక.. ఇంట్రెస్టింగ్ పోస్ట్‌తో సోషల్ మీడియాను షేక్ చేసేసిందిగా!
X

దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక(Niharika)కు పరిచయం అక్కర్లేదు. ఈ అమ్మడు మెగా హీరో నాగబాబు(Nagababu) కూతురిగా పరిచయం అయింది. మొదట బుల్లితెర యాంకర్‌గా వచ్చిన ఆమె ఆ తర్వాత హీరోయిన్‌గా మారింది. పలు చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే.. మెగా ఫ్యామిలీ ఆమెను జొన్నలగడ్డ చైతన్య(Jonnalagadda Chaitanya)కు ఇచ్చి పెళ్లి చేశారు. దీంతో వివాహం తర్వాత ఆమె ఇండస్ట్రీకి దూరం అయింది. భర్తతో పర్సనల్‌ లైఫ్‌ను ఎంజాయ్ చేసింది. కానీ వీరి కాపురం మున్నాళ్ల ముచ్చటగానే మారింది. మనస్పర్ధలు తలెత్తడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక డైవర్స్ తర్వాత నిహారిక మళ్లీ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సంస్థను తీసుకువచ్చి నిర్మాతగా మారింది.

ఇక ఈ సంస్థపై మొదటి చిత్రంగా తెరకెక్కిన ‘కమిటీ కుర్రోళ్లు’ (committee kurrollu )ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత ఏడాది థియేటర్స్‌లోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు భారీ కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీసు వద్ద రాణించింది. చిన్న చిత్రంగా వచ్చి ఊహించని విధంగా ఘన విజయం సాధించింది.ఇందులో నటించిన వారంతా కొత్త నటీనటులు అయినప్పటికీ అద్భుతంగా చేశారు. ఇక నిహారిక మొదటి మూవీతోనే నిర్మాతగా చెరగని ముద్ర వేసుకుంది. అంతేకాకుండా హీరోయిన్‌గానూ నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా గుడ్ న్యూస్ ప్రకటించింది.

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ‘ప్రొడక్షన్-2’ రాబోతున్నట్లు వెల్లడించింది. అయితే ఇది తన రెండవ చిత్రంగా రాబోతుండగా.. దీనిని మానస శర్మ(Manasa Sharma) తెరకెక్కిస్తోంది. ఇందులో సంగీత్ శోభన్(Sangeet Shobhan) హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు నిహారిక నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఇక ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె దర్శకురాలు, హీరోతో కలిసి తీసుకున్న ఫొటోను షేర్ చేసింది. ఈ పోస్ట్‌కు నిహారిక ‘‘కొత్త ప్రాజెక్ట్. కొత్త కథ. సినిమాపై కూడా అదే ప్రేమ. తర్వాత ఏమి జరుగుతుందో వేచి ఉండండి ! అయితే జానర్‌ని మీరు ఊహించగలరా?’’ అనే క్యాప్షన్ జత చేసింది. అలాగే ఈ సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కాబోతున్నట్లు తెలుపుతూ.. ఈ ఏడాదిలోనే విడుదల కాబోతున్నట్లు ప్రకటించింది. నిహారిక పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక అది చూసిన నెటిజన్లు సూపర్, మరో బ్లాక్ బస్టర్ వచ్చేస్తుందంటూ కామెంట్లు పెడుతున్నారు.

Next Story