భర్తతో ఆ మధుర క్షణాలను పంచుకున్న మెగా కోడలు.. నెట్టింట ఆకట్టుకుంటున్న క్యూట్ ఫొటో(పోస్ట్)

by I. Sairam |

సొట్టబుగ్గల చిన్నది లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు.

భర్తతో ఆ మధుర క్షణాలను పంచుకున్న మెగా కోడలు.. నెట్టింట ఆకట్టుకుంటున్న క్యూట్ ఫొటో(పోస్ట్)
X

దిశ, వెబ్‌డెస్క్: సొట్టబుగ్గల చిన్నది లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ‘అందాల రాక్షసి’(andala Rakshasi) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో ‘నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న.. ఈ చదువులు నా వల్ల కావడం లేదు’ అని అమాయకంగా చెప్పే డైలాగ్ ఎంతగా ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా తన నటనతో ఫుల్ మార్కులే కొట్టేసింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అన్ని సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే మెగా హీరో ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej)తో పీకల్లోతు ప్రేమలో పడ్డది ఈ అమ్మడు.

అలా కొన్నాళ్లు సీక్రెట్‌గా లవ్ చేసుకున్న ఈ జంట.. ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి గత ఏడాది పెళ్లి కూడా చేసుకున్నారు. ఇక మ్యారేజ్ తర్వాత భర్తతో వేకెషన్స్‌కి వెళుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. అంతేకాకుండా వాటిని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇస్తుంది. అయితే పెళ్లి తర్వాత ఈ బ్యూటీ ‘మిస్ పర్‌ఫెక్ట్’(Miss Perfect) అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఇక రీసెంట్‌గా లావణ్య పుట్టిన రోజు సందర్భంగా ‘సతీ లీలావతి’(Sathi Leelavathi) అనే మూవీలో నటించబోతున్నట్లు తెలిపింది.

ఇక అప్పటి నుంచి లావణ్య మూవీ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతదా అని ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ నెపథ్యంలో తాజాగా ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయినట్లు రీసెంట్‌గా లావణ్య వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. నిత్యం సామాజిక మాధ్యమాల్లో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతున్న ఈ సొట్టబుగ్గల చిన్నది.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ స్టోరీ పెట్టింది. అందులో తన భర్త వరుణ్ తేజ్‌తో గడుపుతున్న మధుర క్షణాలు గడుపుతున్న క్యూట్ ఫొటోను పంచుకుంది. ఒకే పిల్లో మీద వీరిద్దరు తల వాల్చి పడుకున్న మూమెంట్‌ను షేర్ చేసింది.

దీంతో ఈ ఫొటో కాస్తా నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు వావ్ సో క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా వరుణ్ తేజ్ రీసెంట్‌గా ‘మట్కా’(Matka) మూవీతో మన మందుకు వచ్చి.. ఓకే ఒకే అనిపించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మేర్లపాక గాంధీ(Merlapaka Gandhi) దర్వకత్వంలో ‘వీటీ-15’(VT-15) అనే మూవీ చేస్తున్నాడు. ఇండో కొరియన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ మార్చి నుంచి స్టార్ట్ కానున్నట్లు సమాచారం.


Next Story