- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తన మూవీ షూటింగ్ అప్డేట్ ఇచ్చిన మెగా కోడలు.. క్యూరియాసిటీ పెంచుతున్న పోస్ట్
సొట్టబుగ్గల చిన్నది లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: సొట్టబుగ్గల చిన్నది లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ‘అందాల రాక్షసి’(andala Rakshasi) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన నటనతో ఫుల్ మార్కులే కొట్టేసింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అన్ని సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే మెగా హీరో ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej)తో పీకల్లోతు ప్రేమలో పడ్డది ఈ అమ్మడు.
అలా కొన్నాళ్లు సీక్రెట్‌గా లవ్ చేసుకున్న ఈ జంట గతేడాది పెళ్లి కూడా చేసుకున్నారు. ఇక మ్యారేజ్ తర్వాత భర్తతో వేకెషన్స్‌కి వెళుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. అయితే పెళ్లి తర్వాత ఈ బ్యూటీ ‘మిస్ పర్‌ఫెక్ట్’(Miss Perfect) అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ప్రస్తుతం లావణ్య ‘సతీ లీలావతి’(Sathi Leelavathi) అనే మూవీలో నటిస్తోంది.
మలయాళ నటుడు దేవ్ మోహన్(Dev Mohan) ప్రధాన పాత్రల్లో దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ పతాకాల సంయుక్త నిర్మాణ సారథ్యంలో ప్రొడక్షన్ నెం.1 చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి తాతినేని సత్య(Tatineni Sathya) దర్శకత్వం వహిస్తుండగా.. నాగమోహన్ బాబు.ఎమ్(M. Mohanbabu), రాజేష్.టి(T. Rajesh) నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చింది మెగా కోడలు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసింది. తాజాగా లావణ్య తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ స్టోరీ పెట్టింది. అందులో సతీ లీలావతి సినిమా షూటింగ్ కొడై కెనాల్‌లో జరుగుతున్నట్లు వెల్లడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు ఈ అప్డేట్‌తో మీ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెరిగిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు.
Read More..
రామ్ చరణ్ "పెద్ది" సినిమాలో ఐటెం సాంగ్... రంగంలోకి స్టార్ హీరోయిన్?






