Vishvambhara: గూస్ బంప్స్ తెప్పిస్తున్న మెగాస్టార్ ‘విశ్వంభర’ మెగా బ్లాస్ట్ గ్లింప్స్

by Chukka Sudharani |   (  Updated:2025-08-26 05:32:01  IST  )

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘విశ్వంభర’ ఒకటి.

Vishvambhara: గూస్ బంప్స్ తెప్పిస్తున్న మెగాస్టార్ ‘విశ్వంభర’ మెగా బ్లాస్ట్ గ్లింప్స్
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘విశ్వంభర’ ఒకటి. మెగా అభిమానులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఈ చిత్రాన్ని వశిష్ట దర్శకత్వం వహిస్తుండగా.. యూవి క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇందులో త్రిష, అషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ .. వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్‌గా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతున్నట్లు తెలిపారు.

ఇక మెగాస్టార్ బర్త్‌డే స్పెషల్‌గా ఈ సినిమా నుంచి తాజాగా ‘మెగా బ్లాస్ట్ గ్లింప్స్’ పేరుతో గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘ఈ విశ్వంభరలో అసలు ఏం జరిగిందో ఈరోజైన చెప్తావా.. ఒకడి స్వార్థం యుద్ధంగా మారి అంతులేని భయానిచ్చింది.. అంతకు మించిన మరణ శాసనాన్ని రాసింది..’ అనే పవర్ ఫుల్ డైలాగ్స్‌తో స్టార్ట్ అయిన ఈ గ్లింప్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంది. కేవలం 1:14 నిమిషాలు ఉన్న ఈ మెగా బ్లాస్ట్ గ్లింప్స్ రిలీజైన కొద్ది నిమిషాల్లోనే లక్షల్లో వ్యూస్ సొంతం చేసుకుంటూ సోషల్ మీడియాలో దూసుకుపోతుంది.

Next Story